Begin typing your search above and press return to search.

KVV : 'వ‌ర్షంలో వెన్నెల' మేకింగ్‌!

By:  Tupaki Desk   |   3 Sep 2022 5:38 AM GMT
KVV : వ‌ర్షంలో వెన్నెల మేకింగ్‌!
X
కొత్త త‌ర‌హా ప్రేమ‌క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటూ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు యంగ్ హీరో నాగ‌శౌర్య‌. 'ఛ‌లో' మూవీతో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న నాగ‌శౌర్య ఆ స్థాయి స‌క్సెస్ ని సొంతం చేసుకోవాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ ఏదీ వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. 'క‌ణం' నుంచి 'ల‌క్ష్య' వ‌ర‌కు కొత్త త‌ర‌హా క‌థ‌ల‌తో చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ వ‌ద్ద నిల‌బ‌డ‌లేక‌పోయాయి. దీంతో ఈ సారి రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

నాగ‌శౌర్య న‌టించిన లేటెస్ట్ రొమాంటిక్ మూవీ 'కృష్ణ వృంద విహారి'. అనీష్ కృష్ణ ద‌ర్శ‌కత్వం వ‌హించాడు. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో హీరో నాగ‌శౌర్య మ‌ద‌ర్ ఉషా ముల్పూరి నిర్మించారు.

షిర్లే సేటియా హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతోంది. ఫ‌స్ట్ లుక్ నుంచే ఆస‌క్తిని రేకెత్తిస్తున్న ఈ మూవీ భారీ సినిమాల పోటీ కార‌ణంగా గ‌త కొన్ని రోజులుగా వ‌రుస‌గా రిలీజ్ వాయిదా ప‌డుతూ వస్తోంది. ఎట్ట‌కేల‌కు ఈ మూవీని సెప్టెంబ‌ర్ 24న రిలీజ్ చేస్తున్నారు.

ఇప్ప‌టికే చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ ని జోరుగా ప్రారంభించేసింది. రొమాంటిక్ సాంగ్‌ 'వ‌ర్షంలో వెన్నెల‌..', ఏముందిరా.. 'అంటూ సాగే లిరిక‌ల్ వీడియోల‌ని విడుద‌ల చేశారు. తాజాగా శ‌నివారం నాగ‌శౌర్య‌, హీరోయిన్ షిర్లే సేటియాల పై చిత్రీక‌రించిన రొమాంటిక్ సాంగ్ 'వ‌ర్షంలో వెన్నెల‌'.. మేకింగ్ వీడియోని విడుద‌ల చేశారు. మ‌హితి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందించిన ఈ పాట‌కు శ్రీ‌మ‌ణి సాహిత్యం అందించిన ఈ పాట‌ని ఆదిత్య ఆర్కే, సంజ‌న క‌ల్మాంజే ఆల‌పించారు.

ఊటీలోని మైన‌స్ డిగ్రీల చ‌లిలో ఈ పాట‌లోని కొంత భాగాన్ని షూట్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. మ‌రి కొంత భాగాన్ని ఇంటీరియ‌ల్ లొకేష‌న్స్ లొ తెర‌కెక్కించారు. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీలో హీరో నాగ‌శౌర్య, షిర్లే సేటియాల మ‌ధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్ లో కుద‌రిన‌ట్టుగా ఈ మేకింగ్ వీడియోలో తెలుస్తోంది.

స్క్రీన్ పై ఈ ఇద్ద‌రి జంట ప్రేక్ష‌కుల‌ని గిలిగింత‌లు పెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అంతే కాకుండా ఈ పాట‌ని హీరో నాగ‌శౌర్య, షిర్లే సేటియాలు చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం 'వ‌ర్షంలో వెన్నెల‌' మేకింగ్ వీడియో నెట్టింట సంద‌డి చేస్తోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.