Begin typing your search above and press return to search.

యూఎస్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న 'వరుడు..'

By:  Tupaki Desk   |   1 Nov 2021 6:39 AM GMT
యూఎస్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న వరుడు..
X
యువ హీరో నాగ శౌర్య - రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ''వరుడు కావలెను''. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం (అక్టోబర్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లవ్ కామెడీ ఎమోషన్స్ కలబోసిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను అలరిస్తోంది. తొలి రోజు నుంచే పాటిజిట్ టాక్ తో నడుస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతోంది. ఓవర్ సీస్ లో కూడా శౌర్య సినిమాకి ఓపెనింగ్స్ బాగా వచ్చాయి.

'వరుడు కావలెను' సినిమా యూఎస్ఏ లో ఫస్ట్ వీకెండ్ లో దాదాపుగా 200K డాలర్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నాగశౌర్య కు ఇవి మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ గా పరిగణించవచ్చు. గురువారం $ 44K - శుక్రవారం $ 62K - శనివారం $ 68K - ఆదివారం $ 25K వసూళ్ళు సాధించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో 'వరుడు..' కు పోటీగా బరిలో దిగిన 'రొమాంటిక్' సినిమా కలెక్షన్స్ మాత్రం యూఎస్ లో నిరాశ పరిచినట్లు టట్రేడ్ టాక్.

ఆకాష్ పూరీ - కేతిక శర్మ జంటగా అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''రొమాంటిక్''. పూరీ జగన్నాథ్ కథ - స్క్రీన్ ప్లే - మాటలు అందించిన ఈ సినిమా కూడా గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ డే హిట్ టాక్ తెచ్చికున్న ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ రాబడుతోందో. కాకపోతే యూఎస్ఏ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదని తెలుస్తోంది. ఈ మూవీ మొదటి వారాంతంలో కేవలం 10k డాలర్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

'వరుడు కావలెను' సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం.. 'రొమాంటిక్' యూత్ ఫుల్ యాక్షన్ సినిమా అవడంతో యూఎస్ఏ కలెక్షన్స్ లో తేడా కనిపిస్తుందని అనుకోవచ్చు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తర్వాత యూఎస్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన సినిమాగా అక్కినేని నాగచైతన్య 'లవ్ స్టోరీ' నిలిచింది. ఇదే క్రమంలో అక్కినేని అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీ కూడా అక్కడ మంచి వసూళ్ళు రాబట్టింది. ఈ రెండు మినహా ఓవర్ సీస్ లో ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా లేదనే చెప్పాలి. ఇప్పుడు 'వరుడు కావలెను' చిత్రం కూడా డీసెంట్ ఓపెనింగ్స్ సాధించడం గమనార్హం.