Begin typing your search above and press return to search.
'వరుడు కావలెను' ట్రైలర్: లవ్ అండ్ ఎమోషన్స్ కలబోసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్
By: Tupaki Desk | 21 Oct 2021 3:32 PM GMTయువ హీరో నాగ శౌర్య - రీతూ వర్మ జంటగా రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ''వరుడు కావలెను''. ఈ మూవీతో లక్ష్మీ సౌజన్య అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అక్టోబర్ 29న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా ఈరోజు గురువారం ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ ను నిర్వహించారు. తాజాగా హ్యాండ్సమ్ హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అయింది.
పెళ్లి చూపులు అనే కాన్సెప్ట్ నచ్చని అమ్మాయిగా.. ప్రపోజ్ చేసిన ప్రతి అబ్బాయిని రిజెక్ట్ చేసే యువతిగా రీతూ వర్మని చూపించడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అలాంటి అమ్మాయిని చూసి ఇష్టపడి ఇంప్రెస్ చేయాలని చూసే అబ్బాయిగా నాగశౌర్య కనిపించారు. అయితే ఆమె కోసం మన హీరో ఫైట్ చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా కారెక్కి వెళ్లిపోవడాన్ని బట్టి చూస్తేనే ఆ క్యారక్టర్ ఎంత టిపికల్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
అలాంటి పొగరున్న అమ్మాయిని ప్రేమలో దింపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు? ఆమెను పెళ్లి పీటల దాకా ఎలా తీసుకురాగలిగాడు? అనేది ''వరుడు కావలెను'' చిత్రంలో చూపించబోతున్నారు. అయితే ఇందులో ఫన్ - లవ్ తో పాటుగా ఎమోషన్స్ పాళ్ళు కూడా కాస్త ఎక్కువే అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. 'పొగరు బోతులకు ప్రేమియర్ లీగ్ ఉంటే ప్రతి సీజన్ లో ఆవిడే విన్నర్' అని వెన్నెల కిషోర్ చెప్పడం నవ్వు తెప్పిస్తోంది.
'భూమి ఆకాశం ఎప్పుడూ ఎదురెదురుగా ఉన్నా ఎప్పటికీ కలవవు' 'ఒకసారి చదివేసిన పుస్తకాన్ని మళ్ళీ చదివితే కథ మారుతుందా?, లేక ముగింపు మారుతుందా? మారుతుందని ఆశ పడటం పిచ్చితనం.. మారిందని భ్రమ పడటం మూర్ఖత్వం' వంటి గణేష్ కుమార్ రావూరి రాసిన సంభాషణలు బాగున్నాయి. దీనికి విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపధ్య సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. థమన్ స్వరపరిచిన 'దిగు దిగు నాగ' ట్యూన్ ని కూడా ఇందులో ఉపయోగించారు.
కూతురికి పెళ్లి చేయాలని తాపత్రయ పడే తల్లిగా నదియా కనిపిస్తున్నారు. మురళీశర్మ - వెన్నెల కిశోర్ - ప్రవీణ్ - హర్ష వర్ధన్ - సప్తగిరి - అనంత్ - కిరీటి దామరాజు - 'రంగస్థలం' మహేష్ - అర్జున్ కళ్యాణ్ - వైష్ణవి చైతన్య - సిద్దిక్ష తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వంశీ పచ్చిపులుసుల - విష్ణు శర్మ కలిసి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు. మొత్తం మీద అన్ని అంశాలు కలబోసిన ఈ ట్రైలర్ అన్ని వర్గాలను అలరిస్తోంది. ''వరుడు కావలెను'' చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.