Begin typing your search above and press return to search.

హీరోను వేధిస్తోన్న అజ్ఞాత లేడీ

By:  Tupaki Desk   |   9 Nov 2017 11:30 PM GMT
హీరోను వేధిస్తోన్న అజ్ఞాత లేడీ
X
సినీ ఇండస్ట్రీలో తారలకు స్టార్ ఇమేజ్ వస్తే చాలు ఎపుడైనా బయటకి వెళ్ళినపుడు అభిమానుల తాకిడి తట్టుకోవడం చాలా కష్టం. కొందరు ఓపికతో ఉంటే మరి కొందరు అప్పుడే సీరియస్ అవుతారు. మరికొందరైతే చెంపలు చెల్లుమనిపిస్తారన్న సంగతి మనకు తెలిసిందే. అయితే అభిమానం అనేది ఒక లిమిట్ లో ఉంటే అందంగా ఉంటుంది. కానీ హద్దులు దాటితే అది తారలకు కూడా ఇబ్బందిని కలిగిస్తోంది.

రీసెంట్ గా మితిమీరిన అభిమానంతో ఒక లేడి ఫ్యాన్ కూడా బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ ని చాలా ఇబ్బందికి గురు చేసిందట. గత కొంత కాలంగా ఫోన్ చేసి వేధింపులకు గురిచేస్తోందట. గ్యాప్ లేకుండా మెసేజ్ లు కూడా చేసిందట. దీంతో వరుణ్ రెండు మూడు సార్లు మళ్లీ మెస్సేజ్ చేయొద్దని చెప్పాడట. కానీ యువతి అలానే వ్యవహరిస్తుండడంతో ఆమె నెంబర్ ని బ్లాక్ చేయించాడు. అయితే మరుసటి రోజు మరొక నెంబర్ నుంచి కాల్ వచ్చిందట. ఆమె మెస్సేజ్ లకు రిప్లై ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో వరుణ్ షాక్ అయ్యాడట. వెంటనే ఆ రెండు నెంబర్లను పోలీసులకు ఇచ్చి పిర్యాదు చేశాడు. దీంతో పోలిసులు కేసు నమోదు చేసుకొని వారి వివరాలు తెలుసుకుంటామని చెప్పారు.

మొత్తానికి లేడీ సెలబ్రిటీలకు ఆకతాయిల నుండి వేధింపులు ఉన్నట్లే.. ఇలా హీరోల విషయంలో కూడా కొందరు లేడీలు వేధిస్తుంటారని ఈ యవ్వారం చూస్తే మనకు అర్ధమవుతోంది. అది సంగతి.