Begin typing your search above and press return to search.
వీడియో : వడపావ్ తిని వివాదంలో మహేష్ హీరోయిన్..!
By: Tupaki Desk | 16 Jun 2022 7:40 AM GMTసెలబ్రెటీలు ఏం చేసినా కూడా వారిపై జనాల దృష్టి ఉంటుంది. ముఖ్యంగా స్టార్స్ ను ఏ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయాలా అని ఎదురు చూసే వారు చాలా మంది ఉంటారు. వారు అదే పనిగా సోషల్ మీడియాలో సెలబ్రెటీల యొక్క తప్పులను... వారు బ్రేక్ చేసిన రూల్స్ ను గురించి ఎత్తి చూపుతూ విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ అమ్మడు నటించిన జియో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ముంబై మెట్రో లో ప్రయాణించింది.
సినిమా కు సంబంధించిన విషయాలను పంచుకుంటూ యూనిట్ సభ్యులు సరదాగా మెట్రోలో ప్రయాణించారు. ఆ సమయంలో కియారా అద్వానీ వడపావ్ తింటూ కనిపించింది.
మెట్రో రైల్ లో వడపావు తింటున్న కియారా అద్వానీ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ వీడియో వైరల్ అవ్వడంతో పాటు కొందరు ఆ వీడియో లో ఉన్న కియారా అద్వానీని విమర్శించడం మొదలు పెట్టారు. మెట్రో రైల్ లో ఆహార పదార్థాలు తినడం పై నిషేధం ఉంటుంది. ఆ విషయాన్ని కియారా అద్వానీ పట్టించుకోకుండా వడపావ్ తిన్నది.
ఎవరైనా సామాన్యులు ఇలా వడ పావును మెట్రో రైల్ లో తిని ఉంటే ఖచ్చితంగా వారికి జరిమానా లేదా మరో రకంగా శిక్ష ఉండేది. కాని కియారా అద్వానీ ఒక స్టార్ సెలబ్రెటీ అవ్వడం వల్ల ఆమె ఏం చేసినా తప్పు కాదు అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. అయినా కియారా కు అయినా ఆ విషయమై అవగాహన ఉండాలి కదా అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.
ఆ మెట్రో రైల్ లో కియారా మాత్రమే కాకుండా హీరో వరుణ్ దావన్.. సీనియర్ స్టార్ అనీల్ కపూర్ ఇంకా ఇతర టెక్నీషియన్స్ కూడా ఉన్నారు. వారు కూడా వడపావ్ తింటూ ఉన్నారు. వారికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చినా కూడా జనాలు మాత్రం వారిని పెద్దగా పట్టించుకోవడం లేదు. కేవలం కియారా అద్వానీ నే టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. కియారా అద్వానీ ఈ విషయమై ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.