Begin typing your search above and press return to search.

కియ‌రా బుగ్గ‌పై కుర్ర హీరో కిస్సు.. ప్రియుడు హ‌ర్ట్!

By:  Tupaki Desk   |   11 Jan 2023 3:53 AM GMT
కియ‌రా బుగ్గ‌పై కుర్ర హీరో కిస్సు.. ప్రియుడు హ‌ర్ట్!
X
ఒక ముద్దే క‌దా అని పెట్టేస్తే ప్రియుడు ఫీల‌వ్వ‌డా? పైగా దర్శకుడి సూచన లేకుండా వేరొక హీరో త‌న ప్రేయ‌సిని ముద్దాడేస్తుంటే చూస్తూ త‌ట్టుకోగ‌ల‌డా? పాపం అలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నాడు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా. త‌న ప్రేయ‌సి అనుమ‌తి లేకుండా వేరొక హీరో బుగ్గ‌పై ముద్దు పెట్టేశాడు. దీంతో చాలా రాద్ధాంతం తెర‌పైకొచ్చింది. ఏమిటా క‌థాక‌మామీషు అన్న‌ది తెలియాలంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

యువ‌హీరో వరుణ్ ధావన్ తో ఉన్న‌ సాన్నిహిత్యం కారణంగా కియారా అద్వానీ త‌న ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రా గొడ‌వ ప‌డ్డాడ‌ని బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ గా మారాయి. నిజానికి చాలా కాలంగా సిద్ధార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ ముంబై ప‌రిశ్ర‌మ‌లో అత్యంత ల‌వ్ లీ పెయిర్ గా వెలిగిపోతున్నారు. ఇన్నాళ్లు దాగుడుమూత‌ల ఆట ఆడినా కానీ ఇటీవ‌ల ఓపెనైపోయారు. త్వ‌ర‌లోనే పెళ్లి కోసం రెడీ అవుతున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

కానీ ఇంత‌లోనే ఈ జంట‌ గురించి ఒక‌ వింత పుకార్ హెడ్ లైన్స్ లోకొచ్చింది. ఇంత‌కీ ఏమిటా పుకార్‌? అంటే.. వరుణ్ ధావన్ తో కియ‌రా స‌న్నిహితంగా ఉంటోంది. ఈ సాన్నిహిత్యంపై కియారా ప్రియుడు సిద్ధార్థ్ గొడవ పడ్డాడని క‌థ‌నాలొచ్చాయి.

దర్శకుడి సూచనలు లేకుండా ఒక మ్యాగజైన్ షూటింగ్ లో కియ‌రాను వరుణ్ ధావన్ ముద్దుపెట్టుకున్నందుకు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా త‌ట్టుకోలేక‌పోయాడ‌ని.. వెంట‌నే త‌న ప్రేయ‌సితో ఘ‌ర్ష‌ణ ప‌డ్డాడ‌ని దీంతో గొడ‌వ‌లు పెరిగాయ‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ ఇంత‌లోనే ఈ పుకార్ గురించి విని అంద‌మైన‌ జంట తెగ ప‌డి ప‌డీ న‌వ్వేసుకున్నార‌నేదే ఇక్క‌డ ట్విస్టు.

సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీ ఈ ఏడాది దుబాయ్ లో పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. దీనికి ఇరువైపులా కుటుంబాలు ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మైన‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

కానీ దీనికి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది. కియ‌రా ప్ర‌స్తుతం శంక‌ర్ - రామ్ చ‌ర‌ణ్ సినిమాలో క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అటు బాలీవుడ్ లోను వ‌రుస సినిమాల్లో న‌టిస్తోంది. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా క్రేజున్న బిజీయెస్ట్ హీరో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.