Begin typing your search above and press return to search.

గాళ్‌ ఫ్రెండుతో బయటకొచ్చిన వరుణ్‌

By:  Tupaki Desk   |   22 Feb 2017 10:47 AM GMT
గాళ్‌ ఫ్రెండుతో బయటకొచ్చిన వరుణ్‌
X
సాధారణంగా టాలీవుడ్ హీరోలంటే తమ ఎంగేజ్మెంట్ జరిగేవరకు సాటీ ఇండస్ర్టీ పర్సన్ తో తమకు ఉన్న రిలేషన్ దాచేస్తారు. కొంతమంది సమంత అండ్ నాగచైతన్య టైపులో పెళ్లి వరకు వస్తారు కాబట్టి ఓకె.. లేదంటే కొందరు మధ్యలోనే బ్రేకప్ అయిపోతారు కాబట్టి.. అనవసరంగా మ్యాటర్ ముందే పబ్లిక్ చేసుకోవడం ఎందుకులే అనుకుంటుంటారు.

ఇదే తరహాలో బాలీవుడ్ లో కూడా ఒక జోడి ఉన్నారు. రణవీర్ అండ్ దీపిక వంటి హీరోహీరోయిన్లు ఓపెన్ గానే తమ ప్రేమ యవ్వారాన్ని చాటింపు వేసుకుంటుంటే.. హీరో వరుణ్‌ దావన్ మాత్రం తన ప్రేయసి గురించి.. అసలు ప్రేమ వ్యవహారం గురించీ చాలా గుట్టుగా మెయిన్టయిన్ చేస్తున్నాడు. మనోడు ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ తో గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్నాడు. ఆ విషయం మీడియావారు ఎన్నిసార్లు అడిగినా కూడా నో కామెంట్ అంటుంటాడు. కట్ చేస్తే మొన్న షాహీద్ కపూర్ బర్త్ డే పార్టీకి మాత్రం.. నటాషాతో చేతిలో చేయేసుకుని విచ్చేశాడు. ఆ ఫోటో చాలదేంటండీ.. మనోడి ప్రేమాయణం కన్ఫామ్ చేసుకోవడానికి?

ఇకపోతే త్వరలోనే వరుణ్‌ దావన్ అండ్ ఆలియా భట్ జంటగా రూపొందిన బద్రినాథ్‌ కి దుల్హనియా సినిమా రిలీజవ్వబోతోంది. ఈ ప్రేమయవ్వారాలు ఆ ప్రమోషన్ కు కూడా ఉపయోగపడుతున్నాయిలే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/