Begin typing your search above and press return to search.

లోఫర్ తొందర పడుతున్నాడు

By:  Tupaki Desk   |   8 Dec 2015 11:59 AM GMT
లోఫర్ తొందర పడుతున్నాడు
X
ఈ ఏడాదికి రాబోతున్న బిగ్ బడ్జెట్ మూవీల్లో ఈ శుక్రవారమే వస్తున్న బెంగాల్ టైగర్ ఆఖరిదని చెప్పకోవాలి.పెద్ద సినిమాలన్నీ సంక్రాంతి పండుగను టార్గెట్ చేస్తే.. పలు లో, మీడియం బడ్జెట్ సినిమాలు క్రిస్మస్ - న్యూ ఇయర్ లపై కన్నేశాయి. బెంగాల్ టైగర్ మరుసటి రోజే రాంగోపాల్ వర్మ తీసిన కిల్లింగ్ వీరప్పన్ వస్తున్నా.. ఇది డబ్బింగ్ మూవీయే కావడంతో పెద్దగా ఖాతరు చేయడం లేదు ఎవరూ. దీని తర్వాత పూరీ డైరెక్షన్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లోఫర్ మూవీని షెడ్యూల్ చేశారు.

నిజానికి ఈ సినిమా డిసెంబర్ 18న రిలీజ్ చేయాలని భావించినా.. ఇప్పుడు 17వ తేదీనే తెరపైకి తేవాలని నిర్మాతలు నిర్ణయించారు. అంటే ముందుగా అనుకున్న దానికంటే ఒక రోజు ముందే లోఫర్ వెండితెరపై సందడి చేయబోతున్నాడన్న మాట. దీనికి కారణం లేకపోలేదు. ఆ మరుసటి వారంలో ఏకంగా నాలుగు చిన్న సినిమాలు విడుదల కానున్నాయి. దీంతో థియేటర్ల సమస్య రాకుండా, వీలైనంత వరకూ అడ్వాంటేజ్ ని క్యాష్ చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పచ్చు. గోపీచంద్ నటించిన సౌఖ్యం, సుధీర్ బాబు నటించిన భలే మంచి రోజు, నాగశౌర్య చేసిన అబ్బాయితో అమ్మాయి, మోహన్ బాబు- అల్లరి నరేష్ లు కలిసి నటించిన మామ మంచు అల్లుడు కంచు చిత్రాలను.. డిసెంబర్ 24 - 25 తేదీల్లోనే రిలీజ్ చేయనున్నారు.

జనవరి 1న రిలీజ్ కానున్న రామ్ చిత్రం నేను శైలజ వరకూ.. టాలీవుడ్ లో రిలీజ్ కానున్న మూవీస్ ఇవే. ఒకేసారి నాలుగు సినిమాలంటే కాస్త రిస్కే కానీ.. ఈ డేట్ ని మిస్ చేస్తే.. దాదాపు నెలన్నర పాటు రిలీజ్ చేసుకునే అవకాశం లేకపోవడంతోనే.. నిర్మాతలు అదే డేట్ కు ఫిక్స్ అయ్యారు.