Begin typing your search above and press return to search.

మెగాప్రిన్స్ 'మ‌హ‌ర్షి' లా ఇచ్చాడే!

By:  Tupaki Desk   |   6 Aug 2022 5:37 AM GMT
మెగాప్రిన్స్ మ‌హ‌ర్షి లా ఇచ్చాడే!
X
మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ స‌క్సెస్ ఫుల్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మెగా వార‌సత్వంతో వేగంగా దూసుకుపోతున్నాడు. క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల‌తో పాటు డిఫ‌రెంట్ జాన‌ర్ చిత్రాలు చేస్తూ ప్ర‌త్యేక‌త‌ని చాటుతున్నాడు. మెగాబ్రాండింగ్ ని తెలివిగా ఎన్ క్యాష్‌ చేసుకుంటున్నాడు. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన బాక్సింగ్ నేప‌థ్యం సినిమా `గ‌ని` ఫెయిలైనా...అటుపై `ఎఫ్ -3` ఆ ప‌రాజ‌యాన్ని బ్యాలెన్స్ చేసాడు.

ఇది వ‌రుణ్ తేజ్ మాత్ర‌మే ప‌ట్టిన లాజిక్. మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోలున్నా వ‌రుణ్ స్ర్టాట‌జీ మాంత్రం వాళ్లంద‌రికంటే డిఫ‌రెంట్ అని చెప్పాలి. ఎనిమిదేళ్ల కెరీర్ లోనే 11 చిత్రాలు పూర్తిచేసాడు. ప్ర‌స్తుతం త‌న 12వ చిత్రాన్ని డిఫ‌రెంట్ మేక‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారుతో చేస్తున్నాడు. ఇటీవ‌లే ఆ సినిమా ప్రారంభ‌మైంది. ఇది ఓ డిఫ‌రెంట్ జాన‌ర్ చిత్ర‌మ‌ని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం వ‌రుణ్ తేజ్ భారీగానే పారితోషికంగా అందుకుంటున్నాడు. ఇలా వ‌రుణ్ కెరీర్ గ్రాఫ్ ని డే బై డే మెరుగు ప‌రుచుకుంటున్నాడు. ఇక యంగ్ హీరోకి సోష‌ల్ మీడియాలో పాలోయింగ్ భారీగానే ఉంది. ఇన్ స్టాలో మెగా వార‌సుడిని లక్ష‌ల్లో అనుస‌రిస్తున్నారు. మ‌రి అలాంటి అభిమానుల కోసం అప్పుడ‌ప్ప‌డు ఏదైనా స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా ట్రీట్ ఇవ్వాలిగా.

అందుకే ఇప్పుడిలా `మ‌హ‌ర్షి` లా ఫోజుచ్చాడు. ఇదిగో ఇక్క‌డిలో లగ్జీరియ‌స్ బోట్ లో స‌ముద్రంలో విహార యాత్ర‌కు వెళ్లిన స‌మ‌యంలో క్యాప్చ‌ర్ చేసిన‌ ఫోటోని వ‌రుణ్ ఇన్ స్టాలో పోస్ట్ చేసాడు. ఇందులో వ‌రుణ్ ఫుల్ డ్యాండ్స్ టీష‌ర్ట్..బ్లాక్ క‌ల‌ర్ ప్యాట్ ధ‌రించాడు. కాళ్ల‌కి బ్రాండెడ్ షూస్ ..చేతిలో కోక్ తో అచ్చంగా `మ‌హ‌ర్షి`లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ ని త‌ల‌పిస్తున్నాడు.

స‌రిగ్గా ఈ వినింగ్ స‌మ‌యంలో క్యాప్చ‌ర్ చేసిన పిక్ ఇది. బ్లూక‌ల‌ర్ వాట‌ర్...స్కై క‌ల‌ర్...బోట్ లో లైటింగ్ మొత్తంగా ఆ పిక్ లో ఏడు ర‌కాల బ్లూ క‌ల‌ర్స్ మ్యాచ్ అయిన‌ట్లు తెలుస్తోంది. అందుకే వ‌రుణ్ `7 కూల్ బ్లూస్` అంటూ ఆ ఫోటోకి క్యాప్ష‌న్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది.

అభిమానులు షేర్లు..లైక్ ల‌తో వ‌రుణ్ ని మ‌రింత ప్ర‌మోట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్ వెకేష‌న్ లో ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో షూటింగ్ లు బంద్ పెట్ట‌డంతో స్టార్లంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌య్యారు. వ‌రుణ్ మాత్రం ఇలా వెకేష‌న్ ప్లాన్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.