Begin typing your search above and press return to search.

నానిగాడు.. భ‌లే మ‌గాడ్రా బుజ్జీ!

By:  Tupaki Desk   |   6 Sep 2015 7:00 AM GMT
నానిగాడు.. భ‌లే మ‌గాడ్రా బుజ్జీ!
X
ఆడు మ‌గాడ్రా బుజ్జీ... అంటూ `అత‌డు`లో త‌నికెళ్ల భ‌ర‌ణి ఓ డైలాగ్ చెబుతాడు. అదెంత పాపుల‌రో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌సరం లేదు. ఇప్పుడు అదే డైలాగ్‌ ని యువ క‌థానాయ‌కుడు నానికి ఆపాదిస్తే ఎలా ఉంటుంది? క‌థానాయ‌కుడు వ‌రుణ్‌ సందేశ్ తండ్రి విజ‌య్ సార‌థి జీడిగుంట అదే చేశాడు. `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌` సినిమా చూశాక ఆయ‌న‌కి ఈ డైలాగే గుర్తుకొచ్చిన‌ట్టుంది. అందుకే త‌న‌లోని క‌వి హృద‌యాన్ని త‌ట్టిలేపి నానికి ఆపాదిస్తూ కాంప్లిమెంట్ ఇచ్చేశాడు. అదెలా ఉందో మీరే చ‌ద‌వండి...

``ఆడు భలే భలే మగాడు రా...
ఎవడన్నా... పంచ్ డైలాగులు బాగా చెబుతాడు..
లేపోతే డాన్సులు, ఫైటులు.. బాగా చేస్తాడు..

ఈడేంట్రా.. చాలా శ్రధ్ధగా నటిస్తాడు.. ఏదో ఒక కారెక్టర్ లో దూరినట్టు.. పాత్ర లో జీవిస్తున్నట్టు.. చాలా జాగ్రత్తగా... పద్ధతి గా యాక్ట్ చేసాడ్రా... ఆడు భలే భలే మగాడు రా... బుజ్జీ ...`` అంటూ రాసి నానికి పంపాడు. అది చూసిన నాని భ‌లే భ‌లే పొంగిపోయాడు. ఇప్ప‌టిదాకా నాకు వ‌చ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఇదే అని చెప్పుకొచ్చాడు.
నిజంగానే ఈ కాంప్లిమెంట్ చాలా బాగుంది. త‌న త‌న‌యుడు ఓ క‌థానాయ‌కుడిగా కొన‌సాగుతున్నప్ప‌టికీ వేరొక క‌థానాయ‌కుడిని అభినందించ‌డం గ్రేటే! అందుకే ఆ విష‌యాన్ని ప‌దిమందితో పంచుకొన్నాడు నాని. అన్న‌ట్టు వ‌రుణ్‌, నాని మంచి ఫ్రెండ్స్‌. వీళ్లంతా త‌ర‌చుగా క‌లుసుకొంటుంటారు. నానికి హిట్టొచ్చింది కాబ‌ట్టి ఆయ‌న ఫ్రెండ్స్ అంతా సెల‌బ్రేట్ చేసుకొనే స‌మ‌య‌మిది.