Begin typing your search above and press return to search.

పెళ్లి పీటలపైనే ముద్దు పెట్టేశాడే

By:  Tupaki Desk   |   20 Aug 2016 10:57 AM GMT
పెళ్లి పీటలపైనే ముద్దు పెట్టేశాడే
X
హీరో వరుణ్ సందేశ్.. హీరోయిన్ వితికా షేరులు జీవిత భాగస్వాములు అయిపోయారు. 'పడ్డానండి ప్రేమలో మరి' అనే సినిమాలో ప్రేమించుకోవడం మొదలుపెట్టి.. రియల్ లైఫ్ లో కూడా ప్రేమించేసుకున్నారు ఈ జంట. ఆగస్ట్ 19 ఉదయం వీరిద్దరి పెళ్లి జరగగా.. పెళ్లిపీటలపై ఈ జంటను చూసినవాళ్లకు రెండు కళ్లు చాలలేదు.

వితిక అంటే తనకు ఎంత ఇష్టమో.. పెళ్లి పీటలపై ఉన్నపుడే చెప్పకనే చెప్పేశాడు వరుణ్ సందేశ్. తాళి కట్టడం ఇలా పూర్తి కాగానే.. తన భాగస్వామి మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకున్న వరుణ్ సందేశ్.. ఆప్యాయంగా నుదిటిపై ముద్దు పెట్టేశాడు. ఈ హఠాత్ పరిణామాన్ని రితిక బాగానే రిసీవ్ చేసుకున్నా.. అక్కడున్న అందరూ మాత్రం నోరెళ్లబెట్టి చూస్తుండిపోయారు. హిందు వివాహాల్లో పెళ్లి పీటలపై తాకడం కూడా సామాన్యంగా చేయరు. కానీ ఈ కుర్ర హీరో ఏకంగా ముద్దు పెట్టేశాడు.

ఈ నుదిటపై ముద్దు సీన్ ఎంత అందంగా ఉందంటే.. మొత్తం పెల్ళికొచ్చిన అతిథుల్లో ఏ ఒక్కరూ అభ్యంతర పెట్టలేదు. వితికా అంటే ఎంత ఇష్టమో. వరుణ్ సందేష్- రితికా షేరులకు తుపాకి మ్యారేజ్ విషెస్ చెప్పేద్దాం. కలకాలం వీరు ఇంతే ప్రేమగా గడపాలని కోరుకుందాం.