Begin typing your search above and press return to search.

వరుణ్ వితిక లవ్ స్టోరీకి శుభం కార్డ్

By:  Tupaki Desk   |   25 Oct 2015 8:42 AM GMT
వరుణ్ వితిక లవ్ స్టోరీకి శుభం కార్డ్
X
పడ్డానండీ ప్రేమలో మరి అనే తెలుగు సినిమా ఒకటి వచ్చింది. ఇందులో హీరోహీరోయిన్లుగా వరుణ్ సందేశ్ - వితిక షేరు నటించారు. వీళ్లిద్దరూ కలిసి ఈ సినిమాలో నటిస్తూ నిజంగానే ప్రేమలో పడిపోయారు. 2015 వేలంటైన్స్ డే నాడు ఈ మూవీ రిలీజైన తర్వాత.. వీళ్లిద్దరి లవ్ స్టోరీపై వార్తలొచ్చాయి. కానీ వీటిని వాళ్లిద్దరూ కన్ ఫాం చేయలేదు.

రీసెంట్ గా హైద్రాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో డిసెంబర్ 7న వరుణ్ సందేశ్ నిశ్చితార్ధం జరగోబోతోందని తెలిసింది. అప్పటికి కూడా పెళ్లి కూతురు ఎవరో చెప్పని వరుణ్ ఫ్యామిలీ.. ఇఫ్పుడా సస్పెన్స్ కి తెరదించేశారు. వితిక - వరుణ్ తో కలిసి ఉన్న తమ ఫోటోను షేర్ చేసింది అతని కుటుంబం. దీంతో వీళ్ల పెళ్లి ఖాయమైందనే విషయం అఫీషియల్ గా అనౌన్స్ చేసినట్లయింది.

మొత్తానికి 'పడ్డానండీ ప్రేమలో మరి' మూవీ వరుణ్ కి హిట్ ఇవ్వలేకపోయినా.. ఓ రియల్ లైఫ్ హీరోయిన్ ని ఇచ్చింది వరుణ్ సందేశ్ కి. అన్నట్లు సినిమాల్లో హీరోని ప్రేమించినట్లు నిజజీవితంలో చాలా కష్టం, నేను పెద్దలకు చెప్పే చేసుకుంటానని ఓ టైంలో స్టేట్ మెంట్ ఇచ్చింది వితిక. చెప్పినట్లుగానే నచ్చినవాడిని పెద్దల అంగీకారంతో వివాహమాడుతోంది. సిట్యుయేషన్స్ భలే కలిసొచ్చాయి కదూ ఈ జంటకి.