Begin typing your search above and press return to search.
అప్పుడే పది స్క్రిప్టులు విన్నాడట!
By: Tupaki Desk | 25 Nov 2019 1:30 AM GMTయంగ్ హీరో వరుణ్ సందేశ్ కెరీర్ డైలమా గురించి తెలిసిందే. మూడేళ్లుగా ఛాన్సుల్లేక సతమతమవుతున్నాడు. అందాల కథానాయిక వితిక శేరుని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కొంత గ్యాప్ కూడా వచ్చింది. ఇటీవలే మళ్లీ బిగ్ బాస్-3లో భార్య భర్తలిద్దరు ఎంట్రీ ఇవ్వడంతో వరుణ్ పేరు మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. విన్నర్ రేసులో టాప్ -5లో ఉన్నా చివరి నిమిషంలో ఛాన్స్ మిస్సయ్యింది. ప్రస్తుతం వరుణ్ సన్నివేశమేంటి? అంటే.. బిగ్ బాస్-3 తర్వాత తనను అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని.. అంటున్నాడు. ఇప్పటివరకూ పది స్క్రిప్ట్ లు విన్నాడుట.
అందులో ఒకటి మల్టీస్టారర్ కు ఓకే చెప్పాడట. అదే ముందుగా సెట్స్ కు వెళుతుందని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అలాగే మరో కథతో సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలిపాడు. చారిత్రకంగా పాపులారిటీ ఉన్న ఓరుగల్లు నేపథ్యంలో ఓ సినిమా చేస్తానని చెబుతున్నాడు. వర్షం- ఎంసీఏ లాంటి సినిమాలు వరంగల్లు (ఓరుగల్లు) బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కి పెద్ద విజయం సాధించాయి. హైదరాబాద్ కి ధీటుగా అభివృద్ది చెందుతోన్న నగరం కూడా ఇది. చారిత్రక ఆధారాలతో ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అందుకే ఈ తరహా కథతో ఓ సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు. అయితే ఆ తరహా కథాంశం తాను విన్నాడా లేదా? అన్నది తర్వాత చెబుతాడట.
ఇవన్నీ సరే కానీ.. వరుణ్ సందేశ్ చివరి గా 2015లో లవకుశ అనే సినిమాలో నటించాడు. అంటే గ్యాప్ ఇప్పటివరకూ నాలుగేళ్లు. అప్పట్లో మరో రెండు సినిమాలు మొదలు పెట్టాడు గానీ మధ్యలోనే ఆగిపోయాయి. తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన ఐడెంటీతో మరోసారి దూసుకొస్తానని నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. కానీ ఆడియన్స్ ఇప్పుడెలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఒకసారి హీరోగా ఓ వెలిగి ఆ తర్వాత స్ట్రగుల్ అయ్యి.. మళ్లీ కంబ్యాక్ అయిన హీరోలు మనకు తక్కువే. మరి వరుణ్ ప్రయత్నాలు ఎంతవరకూ సఫలం అవుతాయి? అన్నది చూడాలి.