Begin typing your search above and press return to search.
పెళ్లైన నెల్లాళ్లకి వెడ్డింగ్ టీజర్ ఇచ్చారు
By: Tupaki Desk | 26 Sep 2016 5:49 AM GMT'పడ్డానండీ ప్రేమలో మరి' అనే చిత్రంలో కలిసి నటించి.. నిజంగానే ప్రేమలో పడిపోయిన జంట వరుణ్ సందేష్. వితికా షేరు. ఆన్ స్క్రీన్ హీరో-హీరోయిన్స్ అయిన వీరిద్దరూ.. రియల్ లైఫ్ లోనూ భార్యాభర్తలు అయిపోయారు. తమ ప్రేమను ఇంట్లో చెప్పి ఒప్పించేసుకుని.. అరేంజ్డ్ మ్యారేజ్ గా మార్చుకుని.. గతేడాది డిసెంబర్ లో నిశ్చితార్ధం చేసుకుని.. మొన్న ఆగస్ట్ 19న మూడు ముళ్ల సాక్షిగా ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు.
అయితే.. పెళ్లి పీటలపైనే తన రియల్ లైఫ్ హీరోయిన్ కు రియల్ ముద్దు పెట్టేసి షాక్ ఇచ్చిన వరుణ్ సందేష్.. ఆ ఈవెంట్ ను మరింత మధురంగా కలకాలం గుర్తుండిపోయేలా మలచుకుంటున్నాడు. ఇప్పుడు వీరి పెళ్లికి సంబంధించి ఓ వీడియో టీజర్ ను విడుదల చేశాడు సదరు ఫోటోగ్రాఫర్. వారి పెళ్లినాటి రోజులను ఎంతో అందంగా తీర్చిదిద్ది.. మంచి ఆడియో ట్రాక్ వేసి పోస్ట్ చేసిన వీడియో సూపర్బ్ గానే ఉంది. ఇకపోతే ఈ హీరో నటించిన సినిమాలో పాటను బ్యాక్ గ్రౌండ్ లో ప్లే చేస్తే.. బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. విక్రమ్ నటించిన ఇరుమగన్ లోని హెలెనా పాటకు.. వీళ్లిద్దరి విజువల్స్ కి యాడ్ చేయడం.. అంతగా సెట్ కాలేదు. వేరే ఎవరికైనా అయితే ఓకే కానీ.. రియల్ గానే హీరో హీరోయిన్స్ అయిన వీరిద్దరికీ.. వేరే వాళ్ల పాట పెట్టడమేంటో.. ఆ క్రియేటివిటీకి రూపకర్త ఎవరో?
అయినా ఎప్పటిప్పుడు లైవ్ లో ఇచ్చేసే ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చేసిన టైమ్ లో.. పెళ్లి జరిగి నెల పైన ఓ వారం గడిచాక టీజర్ ఏంటో.. వరుణ్ సందేష్ కే తెలియాలి. ఏదేమైనా వారి ఆనందాన్ని ఇలా మనతో పంచుకున్నందుకు.. మనం కూడా ఆనందిద్దాం.