Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌: నీకే పెళ్లాం ఉందా...వ‌రుణ్‌ పై ఫైర్‌

By:  Tupaki Desk   |   16 Oct 2019 5:13 AM GMT
బిగ్‌ బాస్‌: నీకే పెళ్లాం ఉందా...వ‌రుణ్‌ పై ఫైర్‌
X
బిగ్ బాస్ చివరి దశకు చేరుకోవడంతో కంటెస్టంట్స్ మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. సోమవారం నామినేషన్ ప్రక్రియ తర్వాత ఈ రచ్చ మరింత పెరిగింది. సోమవారం ఎపిసోడ్ లో ఇచ్చిన టాస్క్ సరిగా చేయకుండా వరుణ్ - వితికా - శివజ్యోతిలు గొడవ పడిన విషయం తెలిసిందే. దీంతో బిగ్‌ బాస్ ఊహించని షాక్ ఇస్తూ ఇంటి లో ఉన్న ఏడుగురు సభ్యులని నామినేషన్ లో పెట్టాడు. అయితే సోమవారం వరుణ్-జ్యోతి మధ్య జరిగిన గొడవ మంగళవారం ఎపిసోడ్లో కూడా కొనసాగింది.

వరుణ్...తనని కంత్రీ - ఓవర్ యాక్టింగ్ అని మాట్లాడటం పట్ల శివజ్యోతి బాబా భాస్కర్ - శ్రీముఖిలకు చెప్పుకుని బాధపడింది. ఈలోపు వరుణ్ వచ్చి జ్యోతిపై మళ్ళీ నోరు జారాడు. ‘నువ్ నన్ను ఏం అనలేదా? నాకు వార్నింగ్ ఇవ్వలేదా? అంటూ గొడవని పెంచే ప్రయత్నం చేశాడు. ఇక నేను బతకకపోతే అందర్నీ ముంచేయాలనే యాటిట్యూట్ నీది. ఇది ఎంత బ్యాడ్’ అంటూ మాట్లాడాడు. ఇక ఎప్పటిలాగానే వితికా వచ్చి తన డ్రామా మొదలుపెట్టి..వరుణ్ ని కూల్ చేసింది.

అయితే తర్వాత కూడా ఈ గొడవ మీద చర్చ కొనసాగింది. వరుణ్ - వితికా బాబా భాస్కర్ తో గొడవపై చర్చ పెట్టగా, శివజ్యోతి..అలీ - రాహుల్ లతో తన బాధ చెప్పుకుంది. అసలు తనకే పెళ్ళాం ఉందా? నన్ను కంత్రీ అంటే మా ఆయన రియాక్ట్ కాడా? నేను ఇంత కష్టపడి ఇంత వరకూ వస్తే.. ఇప్పుడు గేమ్ వదిలేసి వెళ్లిపోవాలా? నీ భార్యతో మాట్లాడితే ఇలా చేస్తావా? అంటూ వరుణ్ మాట్లాడిన మాటలని గుర్తు చేసుకుని జ్యోతి రాహుల్ దగ్గర కన్నీరు పెట్టుకుంది.