Begin typing your search above and press return to search.

అబ్బే.. నాలుగోది సెట్టవ్వలేదు - వరుణ్‌

By:  Tupaki Desk   |   21 Oct 2015 7:32 PM GMT
అబ్బే.. నాలుగోది సెట్టవ్వలేదు - వరుణ్‌
X
''అబ్బే.. చాలా కథలు విన్నాను. కాని ఏ కథనూ ఓకె చెయ్యలేదు. ఏ కథకుడినీ ఫైనల్‌ చేయలేదు. ఏ దర్శకుడితో చేస్తానో ఇంకా తెలియదు'' అంటూ చెప్పుకొచా్చడు మెగా హీరో వరుణ్‌ తేజ్‌. ఈరోజు 'కంచె' సినిమాతో వస్తున్న వరుణ్‌ తేజ్‌.. తన తదుపరి సినిమాల గురించి మాంచి కామెంట్లే చేశాడు.

నిజానికి 'ముకుంద' సినిమాతో తెరంగేట్రం చేసిన వరుణ్‌ తేజ్‌.. అసలు ఎలాంటి సినిమా చేస్తాడో.. ఎలాంటి క్యారెక్టర్లు చేస్తాడు అనే విషయంపై క్లారిటీ లేదు. సడన్‌ గా ఒకవైపు రెండో సినిమాగా ఆర్టు సినిమా ''కంచె''ను ఓకే చేస్తే.. మరోవైపు పూరి జగన్‌ తో ''లోఫర్‌'' సినిమాను చేసేశాడు. ఇదేమో పక్కా మాస్‌ సినిమా. అందుకే ఈ రెండు సినిమాలు రిలీజ్‌ అయితేనే కాని నేను తదుపరి డెసిషన్‌ తీసుకోలేను అంటున్నాడు. ''ఎలాంటి క్యారెక్టర్లకు అభిమానులు కనెక్టవుతారో ఇంకా తెలియదు. సో.. ఈ రెండు సినిమాలూ రిలీజ్‌ అయ్యి రిజల్టు వచ్చేస్తే.. అప్పుడు నాలుగో సినిమాను ఫైనల్‌ చేస్తా'' అంటున్నాడు వరుణ్‌.

అయితే గత రోజున రైటర్‌ డైరెక్టర్‌ వీరూ పోట్ల డైరక్షన్‌ లో మనోడు నాలుగో సినిమా చేస్తున్నాడు టాక్‌ వచ్చింది. కాకపోతే మనోడు కథ అయితే చెప్పాడు కాని.. దానిని వరుణ్‌ తేజ్‌ ఓకె చెయ్యలేదు. అది సంగతి.