Begin typing your search above and press return to search.
కుర్రాళ్లా వీళ్లు.. కత్తుల్లా ఉన్నారుగా
By: Tupaki Desk | 1 July 2016 4:15 AM GMTసాధారణంగా అవార్డ్ ఫంక్షన్స్ అంటే ఇంతకుముందు అమ్మాయిల హంగామా కనిపించేది. వయ్యారి భామలంతా వగలు పోతూ డ్రస్సులు వేసుకొచ్చేవారు. అందాల విందు చేస్తూ ఆహుతులను ఆనందపరచడం ఆనవాయితీ. మెల్లమెల్లగా ఈ ట్రెండ్ మారిపోయింది. అమ్మాయిలకు మించి అబ్బాయిలు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా కుర్ర హీరోలైతే కొత్త స్టైల్స్ ని పరిచయం చేసేస్తున్నారు.
ఇప్పుడు సైమా అవార్డుల ఫంక్షన్ సింగపూర్ లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. దక్షిణాది సినీ తారలంతా సింగపూర్ కి క్యూ కట్టేశారు. అక్కడ మన టాలీవుడ్ కుర్రాళ్లు మెరిసిన తీరు చూస్తే కళ్లు జిగేల్ మనాల్సిందే. మెగా ఫ్యామిలీ నుంచి ఒకరు.. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇద్దరు కలిసి రెడ్ కార్పెడ్ పై మెరిశారు. సుశాంత్.. వరుణ్ తేజ్.. అఖిల్ లు ముగ్గురూ కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. ముగ్గురూ సేమ్ స్టైల్ లో భలే ఇరగదీశారు. బ్లాక్ సూట్స్ లో అదిరిపోయే లుక్స్ లో ఆకట్టుకున్నారు ముగ్గురు హీరోలు.
వరుణ్ తేజ్, అఖిల్, సుశాంత్ లు ముగ్గురు స్టైలిష్ గా గడ్డం లుక్ లోనే ఉండడం విశేషం. సెలబ్రిటీ ఫ్యామిలీలకు చెందిన వారసులు కావడంతో.. ఆ స్టైల్ హెయిర్ నుంచి షూ వరకూ ప్రతీ అంశంలోనూ కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కుర్రాళ్లు సానబట్టిన కత్తుల్లా మెరిసిపోయారు.