Begin typing your search above and press return to search.

ఫస్ట్ స్పేస్ మూవీ ఎవరిది?

By:  Tupaki Desk   |   25 Nov 2018 1:30 AM GMT
ఫస్ట్ స్పేస్ మూవీ ఎవరిది?
X
హాలీవుడ్ లో తప్ప మనవైపు స్పేస్ థ్రిల్లర్స్ తీసే సాహసం ఇంతవరకు ఎవరూ చేయలేకపోయారు. అందుకే గ్రావిటీ లాంటి సాగదీసినట్టు ఉండే సినిమాలు కూడా ఇక్కడ బ్రహ్మాండంగా ఆడాయి. ఐమ్యాక్స్ లో ఇంటర్ స్టెల్లార్ ఏకంగా శతదినోత్సవం చేసుకుంది. కానీ ఇప్పుడు దర్శకుల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చి మనవాళ్ళు కూడా స్పేస్ మూవీస్ వైపు దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగా ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న అంతరిక్షం మీద ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి. క్రిష్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ స్పేస్ మూవీని డిసెంబర్ 21న విడుదల చేయబోతున్నారు.

నిజానికి అంతరిక్షం మొదటి ఇండియన్ స్పేస్ థ్రిల్లర్ మూవీగా చెప్పబడుతోంది. జయం రవి ఇదే ఏడాది టిక్ టిక్ టిక్ అనే మూవీ చేసాడు కానీ క్వాలిటీ కాంప్రమైజ్ తో పాటు ఇతర అంశాలు ఎక్కువగా ఉండటంతో అది స్పేస్ మూవీగా గుర్తింపు పొందలేకపోయింది. సో మెగా హీరోనే మూవీనే మొదటిది అవుతుంది. ఇదిలా ఉంచితే బాలీవుడ్ లో మిషన్ మంగళ్ పేరుతో రూపొందుతున్న ఓ స్పేస్ మూవీని అక్కడి మీడియా ఇండియన్ ఫస్ట్ స్పేస్ మూవీగా ప్రచారం మొదలుపెట్టింది. టీమ్ కూడా అదే పబ్లిసిటీతో షూటింగ్ ఇవాళ్టి నుంచి మొదలు పెట్టింది. అదేంటి ఇంకో నెల రోజుల్లో వచ్చే మన అంతరిక్షం కదా ఫస్ట్ స్పేస్ మూవీ అనే అనుమానం రావొచ్చు. దానికి క్లారిటీ రావాలంటే విడుదల దాకా ఆగాల్సిందే.

మిషన్ మంగళ్ లో స్టార్లు చాలా ఉన్నారు. అక్షయ్ కుమార్ హీరోగా తాప్సీ పన్ను-విద్యా బాలన్-నిత్య మీనన్-సోనాక్షి సిన్హా ఇలా ఇందరితో భారీ ఎత్తున రూపొందుతోంది. విడుదల వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఉండొచ్చు. కథకు సంబంధించి రాధా భరద్వాజ్ అనే రచయిత కోర్ట్ లో వేసిన కేసు విచారణ పూర్తి కాకుండానే షూటింగ్ మొదలుపెట్టారు. మరి ఇండియన్ ఫస్ట్ మూవీ మన అంతరిక్షమా లేక మిషన్ మంగళా తేలాలంటే ఇంకో నెల వేచి చూడాలి