Begin typing your search above and press return to search.
ఒళ్లు వంచి పనిచేస్తున్న మెగాహీరో
By: Tupaki Desk | 11 Jun 2018 5:04 AM GMTకమర్షియల్ ఎలెమెంట్స్ తో రెగ్యులర్ గా వచ్చే సినిమాలకి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.యాక్షన్ సీన్లకు కాస్త కష్టపడితే చాలు. కామెడీ ఎమోషనల్ సీన్స్ అన్ని నటనలో రాటు దేలిన వారికి ఇక ఈజినే. అయితే కొన్ని డిఫరెంట్ క్యాటగిరికి చెందిన చిత్రాల కోసం మాత్రం ప్రాణం పెట్టేయాలి. సమయం చూసుకోకూడదు. ఓపిక చాలా ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తరువాత అన్ని సార్లు ప్రయోగాత్మకమైన ఆఫర్లు రావు.
అందుకే హీరోలు కొన్ని సార్లు శక్తికి కి మించి పని చేస్తారు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా చాలా కష్టపడుతున్నాడు. ఈ మెగా హీరోతో పాటు మరో హాట్ బ్యూటీ ఆదితి రావ్ కూడా ఒళ్లు వంచి పని చేస్తోంది. వీరిద్దరూ సంకల్ప్ రెడ్డి స్పీస్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న కథలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతరిక్షం నేపథ్యంలో ఉంటుంది కాబట్టి వీళ్ళు వ్యోమగాములుగా నటించడానికి చాలానే శ్రమిస్తున్నారు. సాధారణంగా కొన్ని ఫీట్లు చేయాలి అంటేనే చుక్కలు కనిపిస్తాయి. ఇక పొద్దున నుంచి సాయంత్రం వరకు అవే స్టంట్లు అంటే ఎవరికైనా కష్టంగా ఉంటుంది.
ఈ కథలో ఎక్కువగా గాలిలో తేలుతూ ఉండాలి. ఆడియెన్స్ కి స్పీస్ లో ఉన్న అనుభూతి కలిగించాలి. అందుకోసం వరుణ్ - అదితి గాల్లోనే ఎక్కువగా ఉంటున్నారు. తాళ్లతో కట్టి వ్రేలాడదీస్తున్నారట. పొద్దున స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం లాంచ్ వరకు. మళ్లీ ఈవినింగ్ ఫ్యాకప్ చెప్పే సమయానికి గాని సంకల్ప్ ఇద్దరిని వదలడం లేదు. ఇలా తాళ్ల సహాయంతో వ్యోమగామిగా హావభావాలు కరెక్ట్ గా ఉండేలా చేయడం అలవాటు లేని వారికి చాలా కష్టం. మరి ఈ జోడి ఎలా చేస్తుందో చూడాలి.