Begin typing your search above and press return to search.

మెగా అబ్బాయి మొదలెట్టేశాడు

By:  Tupaki Desk   |   19 March 2015 11:49 AM IST
మెగా అబ్బాయి మొదలెట్టేశాడు
X
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన కొత్త వారసుడు వరుణ్‌ తేజ్‌ తొలి సినిమా 'ముకుంద' హిట్టో ఫ్లాపో చెప్పలేని పరిస్థితి. సినిమా అంచనాల్ని అందుకోలేకపోయిందన్నది మాత్రం వాస్తవం. ఇలాంటి సినిమాతో వరుణ్‌ అరంగేట్రం చేయడం జనాల్ని ఆశ్చర్యపరిచింది. రెండో సినిమాతో అయినా రూటు మార్చి పక్కా మాస్‌ మసాలా సినిమా చేస్తాడేమో అనుకుంటే.. క్రిష్‌తో జత కట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు వరుణ్‌. 'కంచె' అనే డిఫరెంట్‌ టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా మొదలైపోయింది.

హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో రాజమహల్‌ లాంటి ఓ పెద్ద బిల్డింగ్‌లో షూటింగ్‌ చేస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందు కథతో ఈ సినిమా రూపొందుతుండటం విశేషం. చారిత్రక నేపథ్యంలో సాగే ప్యూర్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ ఇదని క్రిష్‌ చెబుతున్నాడు. వరుణ్‌ సరసన ప్రజ్ఞ జైశ్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 'కంచె' కోసం తన లుక్‌ మొత్తం మార్చేయబోతున్నాడు వరుణ్‌. క్రిష్‌ ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. 'కృష్ణం వందే జగద్గురం' తర్వాత క్రిష్‌ తీస్తున్న సినిమా ఇదే. 'ఠాగూర్‌' హిందీ రీమేక్‌ 'గబ్బర్‌' కోసం రెండేళ్లు కష్టపడిన క్రిష్‌ ఈ మధ్యే ఆ పనంతా పూర్తి చేసుకుని హైదరాబాద్‌లో ల్యాండయ్యాడు. ఏకధాటిగా 'కంచె' షూటింగ్‌ చేసి.. దసరాకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.