Begin typing your search above and press return to search.
రాయబారితో బాహుబలి కి ప్రాబ్లమేనా?
By: Tupaki Desk | 22 Jan 2016 3:30 PM GMTప్రభాస్ ఇప్పుడు బాహుబలి2ని ఫినిష్ చేసే పని స్టార్ట్ చేసేశాడు. దాదాపు ఈ ఏడాది మధ్యలోనే ప్రభాస్ కి సంబంధించిన వర్క్ ఫినిష్ అయిపోనుంది. చివర్లో నాలుగైదు నెలలు కేవలం గ్రాఫికల్ వర్క్ కే కేటాయిస్తారు కాబట్టి.. ఇప్పుడు ప్రభాస్ నెక్ట్స్ వెంచర్ ఏంటనే ఆలోచన మొదలైపోయింది. సుజిత్ తో ఓ మూవీ ఫైనల్ చేసినా.. రీసెంట్ గా ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు కూడా ఓ విషయాన్ని వెల్లడించారు. ఈ యంగ్ రెబెల్ స్టార్ పెళ్లి వార్తలతోపాటు.. ఓ రొమాంటిక్ మూవీ కూడా చేయబోతున్నట్లు చెప్పారు సీనియర్ రెబల్ స్టార్.
ఇందులో ప్రభాస్ ఓ అందమైన స్పై పాత్రలో కనిపించనున్నాడని రివీల్ చేసేశారు. ప్రభాస్ లాంటి పొడుగైన అందగాడు గూఢచారి పాత్ర చేయడమంటే.. సూపర్బ్ గా ఉంటుంది. కానీ ఇలాంటి పాత్రలో సహజంగా ఒక సమయంలో ఒకరే క్లిక్ అవుతూ ఉంటారు. టాలీవుడ్ వరకూ సూపర్ స్టార్ కృష్ణ ఒక్కరే ఈ మూవీస్ చేసేవారు. ఆ తర్వాత మహేష్ కూడా ట్రై చేశాడు కానీ, తర్వాత పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభాస్ కంటే ముందు మరో గూఢచారి వచ్చేయనున్నాడు. అతనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. క్రిష్ డైరెక్షన్ లో ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ ప్రారంభానికి రెడీ అయింది. కంచె తీసిన వేగంతో పోల్చుకుంటే.. ఆరేడు నెలల్లో స్క్రీన్ల పైకి వచ్చేయడం ఖాయం.
అంటే ప్రభాస్ బాహుబలి కంటే ముందే.. టాలీవుడ్ లో ఓ స్పై ఉంటాడు. ఒకవేళ ఈ పాత్రలో అందగాడైన మెగా హీరో వరుణ్ తేజ్ క్లిక్ అయితే.. ఆ తర్వాత వచ్చే ప్రభాస్ స్పై మూవీకి అంత క్రేజ్ ఉండకపోవచ్చు. మరి ఈ జనరేషన్ గూఢచారి పాత్రలో మెగా హీరో సెట్ అవుతాడా? ప్రభాస్ క్లిక్ అవుతాడా ? వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడే చెప్పడం కష్టం.