Begin typing your search above and press return to search.
క్రిష్... సినిమా చూపించాడు
By: Tupaki Desk | 21 Oct 2015 11:30 AM GMTసాధారణంగా ఎవరైనా కొసరంత కబురు చెప్పి కొండంత పని చేయించుకుంటే సినిమా చూపించేసాడురా బాబు అనుకుంటాం. సినిమా కథల పరంగానే కాక వ్యక్తిగతంగానూ క్రిష్ సౌమ్యుడని అంటారు. మరి అలాంటి క్రిష్ ని ఈ విధంగా ఎందుకన్నట్టో చెప్మా అంటే ..
పిరియాడిక్ డ్రామాగా క్రిష్ తెరకెక్కించిన కంచె సినిమా మరికొన్ని గంటల్లో తెరమీదికి రానుంది. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. అంటే 1940ల కాలమాన పరిస్థుతులను ఈ సినిమాలో చూపించాలి. పరిసరాల పరంగా ఆ కాలంలోకి తీస్కెళ్ళడానికి కళా దర్శకుడు వున్నా అభినయంతో ప్రేక్షకులను ఆ లోకంలోకి తీస్కెళ్ళే భాద్యత నటీనటులదే. అందుకోసం క్రిష్ హీరో వరుణ్ తేజ్ - హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ లకు అలనాటి పాత సినిమాలను బాగానే చూపించారట. వరుణ్ అయితే గ్రామీణ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల కోసం ఎన్టీఆర్ - ఎఎన్నార్ - కృష్ణ సినిమాలు.. యుద్ధ సన్నివేశాల కోసం హాలీవుడ్ వార్ ఫిల్మ్స్ తెగ చూసేసాడట. ఇక రాచకొండ సీతాదేవిగా నటించిన ప్రగ్యా కూడా ఆ కాలానికి సంబంధించిన సినిమాలను చూసిందట. ఏమైనా క్రిష్ వీళ్ళిద్దరికీ ఒక్క సినిమా కోసం లెక్కకు మించి సినిమాలు చూపించాడు. అదీ అసలు విషయం.