Begin typing your search above and press return to search.

ది ఘోస్ట్.. వరుణ్ తేజ్ అలెర్ట్?

By:  Tupaki Desk   |   7 Oct 2022 2:30 AM GMT
ది ఘోస్ట్.. వరుణ్ తేజ్ అలెర్ట్?
X
అమెరికాలో చదువుకుని అక్కడే మంచి ఉద్యోగం చేస్తూ జీవనాన్ని కొనసాగించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు మధ్యలోనే ఆ రూట్ వదిలేసి సినిమా ఫీల్డ్ కు వచ్చేసాడు. తనకు ఎంతో ఇష్టమైన డైరెక్షన్ తోనే అతను ఇప్పుడు బిజీగా మారిపోయాడు. అందరికంటే విభిన్నంగా సినిమాలు చేయగల అతి కొద్దిదర్శకులలో ప్రవీణ్ కూడా ఒకరు అని ఇండస్ట్రీలో ఒక మంచి బ్రాండ్ అయితే ఉంది. మొదట అతను చేసిన ఎల్బిడబ్ల్యూ అనే సినిమా తో పాటు రొటీన్ లవ్ స్టోరీ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఆ తర్వాత చందమామ కథలు అనే సినిమాతో జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఇక మధ్యలో సిద్ధూ జొన్నలగడ్డ రష్మితో బోల్డ్ మూవీ గుంటూరు టాకీస్ ను అయితే ఊహించని విధంగా తెరపైకి తీసుకువచ్చాడు. ఆ తర్వాత గరుడవేగ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన ప్రవీణ్ టాలీవుడ్ స్టార్ హీరోలను కూడా ఆకర్షించాడు. ఇక అతనికి నాగార్జున నుంచి పిలుపు రావడంతో ది ఘోస్ట్ సినిమాను తెరపైకి తీసుకువచ్చాడు.

ఈ సినిమాకు విడుదల ముందు ట్రైలర్ తోనే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం దారుణంగా చేతికిల పడింది. మొదటి రోజే నెగిటివ్ టాక్ రావడంతో రెండవ రోజు చాలావరకు థియేటర్స్ ఖాళీగా కనిపించాయి. ఇక వీకెండ్ కూడా ఈ సినిమాల నిలదొక్కుకోవాదం కష్టంగానే అనిపిస్తుంది. అయితే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలోనే వరుణ్ తేజ్ ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఆ ప్రాజెక్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరపైకి రానుంది. అయితే ఇప్పుడు ది ఘోస్ట్ సినిమా రిజల్ట్ తర్వాత రాబోయే వరుణ్ తేజ్ ప్రాజెక్టు పై కొంత ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుంది. అసలే ఆ సినిమాను నాగబాబు నిర్మిస్తున్నారు. ఆయనకు నిర్మాతగా చాలా పెద్ద డిజాస్టర్స్ ఉన్నాయి.

కాబట్టి ఈ సినిమా ఎలా తెరపైకి తీసుకువస్తారు అనేది మరొక పెద్ద డౌట్. అలాగే వరుణ్ తేజ్ కూడా గణేష్ సినిమాతో ఊహించిన విధంగా డిజాస్టర్ అందుకున్నాడు. ఇక ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాబోయే సినిమాతోనే అతను మంచి సక్సెస్ అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ ప్రాజెక్టు విషయంలో ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటారో లేదో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.