Begin typing your search above and press return to search.

ఈ సారి మెగా క్యాంప్ మంగళూరులో ఫిక్స్

By:  Tupaki Desk   |   2 Aug 2016 5:30 PM GMT
ఈ సారి మెగా క్యాంప్ మంగళూరులో ఫిక్స్
X
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ లోఫర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని కొత్త సినిమా మొదలుపెట్టేశాడు. మూడు నెలల క్రితమే శ్రీనువైట్లతో సినిమా ఫిక్స్ అయినా.. దాని షూటింగ్ రీసెంట్ గానే మొదలుపెట్టాడు. మిస్టర్ అనే టైటిల్ పై రూపొందుతున్న ఈ చిత్రం.. ప్రస్తుతం స్పెయిన్ లో షూటింగ్ జరుపుకుంటోంది.

కొన్ని వారాల క్రితమే స్పెయిన్ షెడ్యూల్ ప్రారంభించిన మిస్టర్ యూనిట్.. ఈ నెల 4తో అక్కడ షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసేయనుందిట. స్పెయిన్ లోని సూపర్బ్ లొకేషన్ లలో షూటింగ్ జరుపుకున్న మిస్టర్.. నెక్ట్స్ షెడ్యూల్ ప్లానింగ్ ని కూడా ఫైనల్ చేశాడు. ఈసారి మళ్లీ వేరే దేశం అంటూ స్పెయిన్ మాదిరిగా టైమ్ వేస్ట్ చేసుకోకుండా.. మంగళూరుకు ఫిక్స్ అయ్యాడు మిస్టర్ వరుణ్ తేజ్. స్పెయిన్ నుంచి వచ్చాక కొన్ని రోజుల గ్యాప్ తీసుకుని యూనిట్ అంతా మంగళూరులో క్యాంప్ వేయనున్నారు.

మంగళూరులో తీయనున్న షెడ్యూల్ తో మిస్టర్ షూటింగ్ పూర్తి కానుండడం విశేషం. ఇక్కడ పెద్ద షెడ్యూల్ నే ప్లాన్ చేశారట. వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేసేసి క్రిస్మస్ నాటికి రిలీజ్ చేయాలన్నది దర్శకుడు శ్రీనువైట్ల ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోగా.. అందుకు తగ్గట్లుగానే పనులు పూర్తి చేసేస్తున్నారు.