Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ లో వరుణ్-వితిక రొమాన్స్..డిస్ట్రబ్ చేయని రాహుల్

By:  Tupaki Desk   |   13 Aug 2019 5:34 AM GMT
బిగ్‌ బాస్‌ లో వరుణ్-వితిక రొమాన్స్..డిస్ట్రబ్ చేయని రాహుల్
X
రోజు రోజుకి బిగ్ బాస్ సీజన్-3 షో రసవత్తరంగా జరుగుతుంది. శనివారం - ఆదివారం హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ తో సరదాగా గడపగా - సోమవారం ఎపిసోడ్ కొంత ఎమోషనల్ గా - కొంత రొమాంటిక్ గా సాగింది. మొదట ఇంటి పనులు - వంట పనుల గురించి హౌస్ లో వాగ్వాదం జరిగింది. గత మూడు వారాలుగా వంటపని చేస్తున్న బాబా భాస్కర్‌ ను తప్పించడం గురించి చర్చ జరిగింది. దీంతో మహేష్ విట్ట తాను వంట చేయగలను కాబట్టి కిచెన్‌ లో పనిచేస్తానని చెప్పారు. అలాగే మిగతా పనులను ఒకరికొకరు కేటాయించుకొన్నారు.

ఆ తర్వాత అసలు సీన్ మొదలైంది. ఇంటిలో కపుల్ గా ఉన్న వరుణ్-వితిక చిన్నపాటి రొమాన్స్ చేశారు. అసలు తనను పట్టించుకోవడం లేదని వితిక కంప్లయింట్ చేయగా,.. అలాంటిదేమి లేదని వరుణ్ చెప్పాడు. వీళ్లిద్ద‌రు కాస్త నాటుగానే రొమాన్స్ చేసుకుంటున్నార‌ని సోష‌ల్ మీడియాలో ట్రెండ్ న‌డుస్తోంది.

అలాగే ఎందుకు శ్రీముఖికి దూరంగా ఉంటున్నావని వరుణ్‌ ని వితిక అడిగింది. శ్రీముఖితో తనకెలాంటి ఎలాంటి ఇబ్బంది లేదని వరుణ్ చెప్పుకొచ్చారు.

తర్వాత అలా అలా ముద్దు - మురిపెంతో లైట్‌ గా రొమాన్స్ చేశారు. ఆ సమయంలోనే రాహుల్ బెడ్ రూమ్ లోకి వస్తుండగా - ఈ జంట రొమాన్స్ చూసి రాహుల్ డిస్ట్రబ్ చేయడం ఇష్టం లేదని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలాగే ఇంట్లో ఈద్ వేడుకలు జరిగాయి. వేడుకలను అలీ ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఇంటి సభ్యులకు సంబంధించిన ఫ్యామిలీ ఫోటోలను చూపించడంతో కొంత భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఈద్ విందును ఏర్పాటు చేశారు. చివరికి ఈద్ పాటకు డ్యాన్సులు చేస్తూ ఇంటి సభ్యులు ఆనందంగా గడిపారు. అలా సోమవారం కొంచెం ఎమోషన్ - కొంచెం రొమాన్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంది.