Begin typing your search above and press return to search.
మెగా ప్రిన్స్ గ్యాప్ 20 రోజులేనా ?
By: Tupaki Desk | 25 Nov 2018 9:58 AM GMTఏ హీరో అయినా ఒక సినిమా తర్వాత మరొకటి రావాలంటే కనీసం మూడు నుంచి ఆరు నెలల గ్యాప్ అవసరమవుతున్న నేపథ్యంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాత్రం కేవలం 20 రోజుల తేడాతో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో రావడం అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. డిసెంబర్ 21న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన అంతరిక్షం విడుదల కానున్న సంగతి తెలిసిందే. కానీ అక్కడి నుంచి కేవలం 20 రోజుల వ్యవధిలో వెంకటేష్ తో కలిసి నటించిన ఎఫ్2 వస్తుంది . ఇది ఇబ్బందికరమైన పరిస్థితే.
ఇదంతా అనుకోకుండా జరిగిందా లేక ముందే ప్లాన్ చేసుకున్నారా అనేది పక్కన పెడితే వరుణ్ కు ఇక్కడ రెండు రకాల ఇబ్బందులు ఉన్నాయి. మూడు వారాలు పూర్తి కాగానే కొత్త సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్దకు వస్తే ఆటోమేటిక్ గా ముందు వచ్చిన దాని లైఫ్ తగ్గిపోతుంది. తక్కువ గ్యాప్ కాబట్టి పోలికలు కూడా వస్తాయి. అదొక చిక్కు అనుకుంటే అన్నయ్య రామ్ చరణ్ తేజ్ వినయ విధేయ రామ జస్ట్ రెండు లేదా మూడు రోజుల ముందు వస్తుంది. ఇమేజ్ పరంగా మార్కెట్ పరంగా తనేమి చెర్రికి పోటీ కాదు కానీ రెండు మెగా హీరోల సినిమాలే కాబట్టి తనకే సమస్య కావొచ్చని వరుణ్ భావిస్తున్నట్టు సమాచారం.
కాని ఎఫ్2 నిర్మాత దిల్ రాజు ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి సీజన్ ను వదిలిపెట్టరు. ఖైది నెంబర్ 150-గౌతమిపుత్ర శాతకర్ణిల మధ్య సింహాల పోటీ ఉన్నప్పుడే కుందేలులాగా కనిపించిన శతమానం భవతిని వాటికి పోటీగా విడుదల ధీటైన హిట్ తో పాటు ఘనంగా వసూళ్లు కూడా దక్కించుకున్నారు. అలాంటిది క్రేజీ మల్టీ స్టారర్ గా మంచి హైప్ తెచ్చుకున్న ఎఫ్2 వాయిదా వేసే ఆలోచన చేసే అవకాశాలు చాలా తక్కువ.
అందుకే వరుణ్ కు ఇది ఒకరకమైన సంకట స్థితి అని చెప్పొచ్చు. కాకపోతే ఎఫ్2 ఇప్పటి దాకా ఫస్ట్ లుక్ తప్ప ఇంకే ప్రమోషన్ చేపట్టలేదు. వినయ విధేయ రామ టీజర్ తో ఎన్టీఆర్ పోస్టర్స్ ఇప్పటికే కావలసినంత రచ్చ చేసాయి. ఎఫ్2 హంగామా ఇప్పుడే మొదలుపెడితే అంతరిక్షంకు ఇబ్బందిగా మారవచ్చనే కారణంతో డిసెంబర్ 21 తర్వాత మొదలుపెడతారట. ఇదెలా ఉన్న వరుణ్ తేజ్ ఫ్యాన్స్ మాత్రం నెల రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే తమ హీరో సినిమాలు రెండు చూసేసుకోవచ్చు