Begin typing your search above and press return to search.

స్పేస్ సినిమాకు చెన్నైలో షాకు!

By:  Tupaki Desk   |   23 Dec 2018 12:20 PM GMT
స్పేస్ సినిమాకు చెన్నైలో షాకు!
X
తెలుగు సినిమాలకు ఈమధ్య పరాయి రాష్ట్రాలలో డిమాండ్ బాగానే పెరిగింది. ముఖ్యంగా తమిళ నాడు రాజధాని చెన్నైలో తెలుగు సినిమాలు జోరుగా కలెక్షన్స్ వసూలు చేస్తున్నాయి. 'బాహుబలి' తో మొదలైన ఈ హంగామా 'భరత్ అనే నేను'.. 'అర్జున్ రెడ్డి'.. 'గీత గోవిందం' వరకూ కంటిన్యూ అయింది. దీంతో కొత్త సినిమాలకు కూడా మనవాళ్ళు భారీ రేట్లే కోట్ చేస్తున్నారు.

ఈ శుక్రవారం విడుదలైన 'అంతరిక్షం' సినిమా చెన్నై ఏరియా థియేట్రికల్ రైట్స్ కు రూ. 45 లక్షలు డిమాండ్ చేశారట. కానీ ఆ రేటు పెట్టి కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో నిర్మాతలే సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశించారు కానీ చెన్నై ప్రేక్షకులు ఈ సినిమాపై అసలే మాత్రం ఇంట్రెస్ట్ చూపకపోవడంతో మొదటి రోజు కలెక్షన్స్ నామమాత్రంగానే ఉన్నాయని సమాచారం. ఈ కలెక్షన్లను బట్టి చూస్తే రిలీజ్ చేయడానికి అయిన ఖర్చు.. పబ్లిసిటీకి అయిన ఖర్చులు కూడా వెనక్కు వచ్చేలా లేదట. ఈ లెక్కన స్పేస్ సినిమాకు చెన్నై లో షాక్ తప్పేలాలేదు.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది. స్పేస్ థ్రిల్లర్ జానర్ తెలుగు తెరకు కొత్తే అయినప్పటికీ ప్రేక్షకులను ఎంగేజ్ చేసేవిధంగా స్క్రీన్ ప్లే లేకపోవడం.. సెకండ్ హాఫ్ మరీ టెక్నికల్ గా ఉండడంతో మెజారిటీ ఆడియన్స్ పెదవి విరుస్తున్నారని టాక్ వినిపిస్తోంది.