Begin typing your search above and press return to search.

ప్రీలుక్: మెగా ప్రిన్స్ బాక్సింగ్ పంచ్

By:  Tupaki Desk   |   10 Oct 2019 7:41 AM GMT
ప్రీలుక్: మెగా ప్రిన్స్ బాక్సింగ్ పంచ్
X
2019 మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ఖాతాలో ప‌డిన‌ట్టే. ఇప్ప‌టికే రెండు స‌రైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు కొట్టాడు. ఎఫ్2 సంక్రాంతి బ‌రిలో తీపి జ్ఞాప‌కంగా మిగిలింది. అలాగే గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ (వాల్మీకి) మాస్ హిట్ గా నిలిచింది. రిట‌ర్నులు రాబ‌ట్టి అత‌డి కెరీర్ కి పెద్ద హెల్ప్ అయ్యింది. ఇదే హుషారులో వ‌రుస‌గా సినిమాల‌కు క‌మిట‌వుతున్నాడు వ‌రుణ్ తేజ్. తాజాగా బాక్సింగ్ నేప‌థ్యంలో మరో ప్రయోగాత్మక చిత్రానికి వ‌రుణ్ సిద్ధమయ్యాడు.

ఇది కెరీర్ ల్యాండ్ మార్క్ 10వ సినిమా కావ‌డంతో ఫ్యాన్స్ లో ఆస‌క్తి నెల‌కొంది. ఈ గురువారం ప్రాజెక్టుని అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్ గా న‌టిస్తున్నాడ‌ని క్లూ ఇస్తూ బాక్సింగ్ గ్లోవ్స్ ని పోస్ట‌ర్ లో ముద్రించారు. రెడ్ బాక్సింగ్ గ్లోవ్స్ తో పంచ్ విసురుతున్న హ్యాండ్ పోస్ట‌ర్ ని వరుణ్ స్వ‌యంగా తన ఇన్ స్టా ద్వారా అభిమానులకు షేర్ చేశారు.

బాస్ అల్లు అరవింద్ సమర్పణలో రినైజన్స్ సినిమాస్- బీడబ్ల్యూసీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సిద్ధూ ముద్దా- అల్లు వెంకటేష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి కిరణ్ కొర్రపాటి దర్శకుడు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ నుండి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు వెళుతున్నారు. వ‌రుణ్ తాజా ప్ర‌య‌త్నం చూస్తుంటే ఒక సినిమాకి ఇంకో సినిమాకి ఏమాత్రం సంబంధం లేకుండా క‌ట్టుదిట్టంగా క‌థ‌ల ఎంపిక‌లో వైవిధ్యం ప్ర‌ద‌ర్శిస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఈసారి బాస్ అల్లు అర‌వింద్ తోడ‌య్యారు కాబ‌ట్టి వ‌రుణ్ కి మ‌రింత గ్యారెంటీ హిట్ అన్న ధీమా పెరిగిన‌ట్టే.