Begin typing your search above and press return to search.

వ‌రుణ్ తేజ్ రేంజుకు త‌గ్గ‌ట్టే ఫిట్నెస్ కోసం త‌ప‌న‌

By:  Tupaki Desk   |   25 Jun 2021 11:30 AM GMT
వ‌రుణ్ తేజ్ రేంజుకు త‌గ్గ‌ట్టే ఫిట్నెస్ కోసం త‌ప‌న‌
X
మెగా ఫ్యామిలీ లో యూనిక్ స్టైల్ తో వేగంగా ఎదిగిన స్టార్ మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్. మెగా బ్రాండ్ ఉన్నా ఎక్స్ క్లూజివ్ స్క్రిప్ట్ సెలెక్ష‌న్ తో స్టార్ గా మార్కెట్ లో త‌న‌కంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకోగ‌లిగాడు. ఇత‌ర‌ ఫ్యామిలీ హీరోల‌తో పోలిస్తే వ‌రుణ్ ఛ‌రిష్మా వేరు అన్న టాక్ వ‌చ్చింది. ప్ర‌తిభ‌తో ఆలోచ‌నా విధానంతో అత‌డు మైమ‌రిపిస్తున్నాడు. క‌మ‌ర్శియ‌ల్ సినిమాలు చేస్తూనే డిఫ‌రెంట్ కాన్సెప్ట్ లున్న సినిమాలు చేయ‌డం వ‌రుణ్ లో ప్ర‌త్యేక‌త‌.

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో త‌న‌కంటూ ఒక స్థాయి ఉంద‌ని వ‌రుణ్ నిరూపించాడు. తాజాగా వ‌రుణ్ తేజ్ పారితోషికం కూడా భారీగానే ఛార్జ్ చేస్తున్నార‌ని తెలిసింది. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఎఫ్-3 సినిమా కోసం ఎనిమిది కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఆ త‌దుపరి చేసే సినిమాకు ఏకంగా నాలుగు కోట్లు పెంచి 12 కోట్లు ఇస్తేనే చేస్తాన‌నే డిమాండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఇంత‌కీ ఆ సినిమా ఏంటి? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. ఎఫ్-3 త‌ర్వాత వ‌రుణ్ తేజ్ నిర్మాత భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్ నిర్మాణ సంస్థ‌లో ఓ సినిమా చేయ‌డానికి అగ్రిమెంట్ చేసుకున్నారు.

ఈ సినిమా కు 12 కోట్లు ఇవ్వాల‌ని వ‌రుణ్ డిమాండ్ చేస్తున్నారుట‌. అందుకు స‌ద‌రు నిర్మాణ సంస్థ సానుకూలంగానే ఉన్న‌ట్లు స‌మాచారం. నిర్మాణ సంస్థ 8 కోట్లు పారితోషికంగా ముందు చేతికిచ్చి మిగిలిన 4 కోట్లు లాభాల్లో వాటాను నాగ‌బాబు ఇవ్వాల‌ని ప్లాన్ చేస్తోందిట‌. మ‌రి ఈ ప్ర‌పోజ‌ల్ వ‌రుణ్ తేజ్ ఒకే చెబుతారా? లేదా? మొత్తం ముందే ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డ‌తారా? అన్న‌ది చూడాలి. వ‌రుణ్ త‌న స్థాయికి త‌గ్గ‌ట్టే మార్కెట్లో బ్రాండ్ విలువ‌ను కాపాడుకునేందుకు త‌న బాడీ లాంగ్వేజ్ ని బ్యాలెన్స్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం బాక్సింగ్ నేప‌థ్యంలో గ‌ని మూవీ చేస్తున్న వ‌రుణ్ త‌దుప‌రి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయ‌నున్నాడు. వీట‌న్నిటి కోసం జిమ్ ట్రైన‌ర్ స‌మ‌క్షంలో క‌ఠోర శిక్ష‌ణ పొందుతున్నాడు. వ‌రుణ్ జిమ్ చేస్తున్న తాజా ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.