Begin typing your search above and press return to search.

వైష్ణవ్ ను చూస్తుంటే బాబాయ్ గుర్తొచ్చాడు: వరుణ్ తేజ్

By:  Tupaki Desk   |   31 Aug 2022 3:07 AM GMT
వైష్ణవ్ ను చూస్తుంటే బాబాయ్ గుర్తొచ్చాడు: వరుణ్ తేజ్
X
వైష్ణవ్ తేజ్ - కేతిక జంటగా 'రంగ రంగ వైభవంగా' సినిమా రూపొందింది. సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక ప్యామిలీ ఎంటర్టైనర్ రాలేదని వైష్ణవ్ చెబుతూ అంచనాలు పెంచేశాడు. ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ కూడా ఆడియన్స్ లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి హైదరాబాదులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ తేజ్ మాట్లాడాడు.

" వైష్ణవ్ తేజ్ కోసం మాత్రమే కాదు .. ఈ సినిమా నిర్మాతల కోసం కూడా ఇక్కడికి వచ్చాను. వాళ్లంతా నాకు బాగా పరిచయం .. ఇంతకుముందు వాళ్లతో కలిసి నేను పనిచేశాను. వాళ్లు కేవలం డబ్బు కోసం మాత్రమే సినిమాలు తీసే నిర్మాతలు కాదు.

సినిమా అంటే వాళ్లకి ఎంతో ప్యాషన్ ఉంది. 25 ఏళ్లుగా వాళ్లు సినిమాలు చేస్తున్నారు. ఒక్క చిరంజీవిగారితో తప్ప్ప మా అందరితో వాళ్లు సినిమాలు చేస్తూ వచ్చారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.

గిరీశాయతో రెండు మూడుసార్లు నేను మాట్లాడాను. కొత్త దర్శకుడే అయినా తనకి ఏం కావాలనే విషయంలో ఆయనకి పూర్తి క్లారిటీ ఉంది. ఆయన మాటలు .. ఆయన విజువల్స్ చూస్తుంటే కొత్త డైరెక్టర్ అని ఎక్కడా అనిపించడం లేదు.

ఆయన పెద్ద డైరెక్టర్ కావాలని మనసారా కోరుకుంటున్నాను. ఏ లవ్ స్టోరీకైనా పాటలు ప్రధానం. ఈ సినిమాకి దేవిశ్రీ అద్భుతమైన పాటలను ఇచ్చాడు. అందుకు ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను.

ఈ సినిమాలోని విజువల్స్ చూస్తుంటే చాలా కొత్తగా అనిపించాయి. అందుకు శ్యామ్ దత్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. వైష్ణవ్ - కేతిక పోస్టర్స్ చూస్తుంటే జోడీ బాగుందనిపించింది. ఆల్రెడీ కేతిక అబ్బాయిల మనసుల్లోకి వెళ్లిపోయిందని అనుకుంటున్నాను. మా పెద్దనాన్నగారు .. మా బాబాయ్ చెప్పినట్ట్టుగానే వైష్ణవ్ తన కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళుతుండటం హ్యాపీగా అనిపిస్తోంది. ఈ సినిమా అనుకోకుండానే బాబాయ్ పుట్టినరోజుకి కుదిరింది. ఇది ఆయన బర్త్ డే గిఫ్ట్ గా భావిస్తున్నాను. ట్రైలర్ లో వైష్ణవ్ ను చూస్తుంటే అక్కడక్కడా బాబాయ్ గుర్తొచ్చాడు" అంటూ చెప్పుకొచ్చాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.