Begin typing your search above and press return to search.
మిస్టర్ వరుణ్ మళ్లీ మొదలుపెట్టేశాడు
By: Tupaki Desk | 5 Dec 2016 7:30 AM GMTమెగా ఫ్యామిలీ హీరో అయిన వరుణ్ తేజ్ గత నెలలో షూటింగ్ లో భాగంగా గాయాలకు గురికావడం తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ మిస్టర్ కోసం ఊటీలో షూటింగ్ చేస్తుండగా.. వరుణ్ కాలికి గాయమైంది.
మొదట చిన్న గాయమే అనే ఉద్దేశ్యంతో మొండిగా షెడ్యూల్ ఫినిష్ చేయడంతో.. చివరకు అది పెద్ద గాయంగా మారిపోయింది. ఏకంగా నెల రోజులకు పైగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ కుర్రాడిని కదపడం ఇష్టం లేక.. మెగా ఫ్యామిలీ అంతా దీపావళిని.. నాగబాబు ఇంటి దగ్గరే చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వరుణ్ బాగా రికవర్ అయ్యాడట అంతే కాదు.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఫిదా షూటింగ్ కి కూడా అటెండ్ అయిపోయాడు.
కామారెడ్డి దగ్గరలో బాన్స్ వాడలో ప్రస్తుతం ఫిదా షూటింగ్ జరుగుతోంది. హీరోయిన్ సాయిపల్లవితో కలిపి కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆ తర్వాత హైద్రాబాద్ లో కొన్ని సన్నివేశాలు తీసి.. యూఎస్ లో సుదీర్ఘమైన షెడ్యూల్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. మధ్యలోనే మిస్టర్ షూటింగ్ ని ఫినిష్ చేసేస్తాడట వరుణ్ తేజ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/