Begin typing your search above and press return to search.

వరుణ్ కి చరణ్ తమ్ముడంటగా...

By:  Tupaki Desk   |   18 Sep 2015 4:34 AM GMT
వరుణ్ కి చరణ్ తమ్ముడంటగా...
X
కంచె ఆడియో ఫంక్షన్ లో రామ్ చరణ్ తేజ్ రెట్టించిన ఉత్సాహంతో కనిపించాడు. ఈ వేడుకలో చెర్రీ పక్కన నించునేందుకు ట్రై చేశాడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. అయితే... వరుణ్ తేజ్ పక్కన తను మరీ పొట్టిగా అనిపించడంతో.. ఇద్దరి మధ్యలోకి అరవింద్ ని తీసుకొచ్చి నుంచో బెట్టి... హైట్ ను భలే కవర్ చేశారు మెగాపవర్ స్టార్. తర్వాత అతిధులు మాట్లాడుతున్నపుడు కూడా హైట్ విషయం ప్రస్తావనకు వచ్చింది.

చరణ్ అన్నయ్య రావడం అంటూ తనకు హ్యాపీగా ఉందని వరుణ్ తేజ్ అంటే... వరుణ్ తనకు అన్నయ్య అంటూ చరణ్ షాకిచ్చాడు. మళ్లీ వివరణ కూడా ఇచ్చేశాడు లెండి. హైట్ విషయంలో తనకు వరుణ్ అన్నయ్యే అని, తాను చిన్నోడుగానే అనిపిస్తానని చెప్పాడు చెర్రీ. తమ కుటుంబం మొత్తానికి అందగాడైన వరుణ్.. సహజంగానే ట్యాలెంట్ కలవాడని పొగిడాడు. మామూలుగా ఇలాంటి ఫంక్షన్ లలో కాస్త ఇబ్బందిగా కదిలే రామ్ చరణ్.. అన్నయ్య వరుణ్ నటించిన కంచె వేడుకలో మాత్రం ఫ్రీగానే ఉన్నాడు. తమ కుటుంబంలోని ప్రియమైన సభ్యుని వేడుక కావడం, డైరెక్టర్ క్రిష్ తో చరణ్ కి మంచి రిలేషన్ ఉండడమే ఇందుకు మెయిన్ రీజన్.

ఏమైనా మాటల విషయంలో చెర్రీ బాగా ముదిరాడు. మొక్కుబాటుగా, ఇబ్బందిగా మాట్లాడే స్థాయి నుంచి.. అభిమానులను అలరించేలా మాట్లాడే వరకూ ఎదిగాడు. అంతేగాదు.. ఒక్కరిని కూడా మర్చిపోకుండా...వచ్చిన ఆహుతులందిరినీ పేరుపేరునా ప్రశంసించాడు. అయినా హైట్ విషయంలో మాత్రం కాస్త ఫీలవుతున్నట్లుగానే కనిపించింది చరణ్ వాలకం. హైట్ విషయంలో ఏముందిలే చెర్రీ, నెవర్‌ మైండ్‌!!