Begin typing your search above and press return to search.

ఫ్యామిలీలో చరణ్‌.. బయట ప్రభాస్‌

By:  Tupaki Desk   |   13 Nov 2015 7:30 PM GMT
ఫ్యామిలీలో చరణ్‌.. బయట ప్రభాస్‌
X
కంచెతో హిట్ కొట్టి.. లోఫర్ షూటింగ్ ని కంప్లీట్ చేసేశాడు మెగా వారసుడు వరుణ్ తేజ్. వచ్చే నెలలో పూరీ డైరెక్షన్ లో రానున్న మూవీ రిలీజ్ కానుండడంతో.. మాస్ హీరోగా అవతారమెత్తనున్న ఈ కుర్రాడు మహా జోష్ లో ఉన్నాడు. సోషల్ మీడియాలో మెగాఫ్యామిలీ మొత్తానికి ఎక్కువ యాక్టివ్ గా ఉండే వరుణ్ తేజ్.. అభిమానులు అడిగి ప్రశ్నలకు ఆసక్తికరమైన ఆన్సర్స్ ఇచ్చాడు.

ఓ అభిమాని భలే టిపికల్ క్వశ్చన్ అడిగాడు. చిరు కాకుండా తమ ఫ్యామిలీలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరని వరుణ్ ని ప్రశ్నిస్తే.. ఏ మాత్రం తడుముకోకుండా... చిరంజీవి కాకుండా అయితే.. నా ఓటు చరణ్ కే అంటూ తేల్చేశాడు వరుణ్ తేజ్. ఇదే కొంచెం కాంప్లికేటెడ్ అనకుంటే.. మరో ఫ్యాన్ ఇంకొంచెం టఫ్ క్వశ్చన్ వేశాడు. మెగా ఫ్యామిలీ పేర్లు కాకుండా ఫ్యావరేట్ యాక్టర్ ఎవరో చెప్పాలని అడిగాడు. ఈ ప్రశ్నకి నాగబాబు తనయుడు ఏ ఆన్సర్ ఇస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురూ చూశారు. అయితే.. వరుణ్ తేజ్ మాత్రం ఏ మాత్రం తడుముకోలేదు. తాను ప్రభాస్ ని ఎంతో అభిమానిస్తానని, అతనంటే చాలా ఇష్టం అని చెప్పేశాడు.

ఏమైనా ఆన్సర్స్ ఇవ్వడంలో ఆచితూచి మాట్లాడుతున్నా.. బాగా క్విక్ రెస్పాన్స్ ఇవ్వడం హైలైట్. అంతే కాదు.. తనను క్వశ్చన్ చేసిన అందిరికీ ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయడం, ఎవరికైనా ఇవ్వకపోతే సారీ చెప్పడంతో.. నెటిజన్లకి తెగ నచ్చేస్తున్నాడు మెగా వారసుడు.