Begin typing your search above and press return to search.
ఇంత తొందర ఎందుకు వరుణ్?
By: Tupaki Desk | 26 Feb 2020 3:30 AM GMTగద్దలకొండ గణేష్ చిత్రం పూర్తి కాకముందే వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటన వచ్చింది. ఆ సినిమా చిత్రీకరణ అదుగో ఇదుగో అంటూ ఇన్నాళ్లు వాయిదా వేశారు. ఎట్టకేలకు సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కేవలం మూడు నాలుగు నెలల్లో పూర్తి చేసేలా దర్శకుడు ప్లాన్ చేశాడట. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. షూటింగ్ విషయంలో ఎలాంటి ఆలస్యం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
షూటింగ్ ప్రారంభం అయిన రోజునే విడుదల తేదీని ప్రకటించారు. అది కూడా చాలా దూరం కాకుండా జులై 30నే ఈ సినిమాను విడుదల చేస్తామంటూ వారు ధీమాగా చెబుతున్నారు. ఆ తేదీకి ఉన్న ప్రత్యేకత ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంవత్సరం పాటు ఆర్ఆర్ఆర్ చిత్రంను ఆ తేదీన విడుదల చేస్తామంటూ ప్రచారం చేశారు. చివరకు వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను వాయిదా వేశారు. ఆ తేదీన కేజీఎఫ్ 2 వస్తుందని అంతా అనుకున్నారు.
ఆ సినిమా విడుదలపై కూడా అనుమానాలు ఉన్న నేపథ్యంలో వరుణ్ తేజ్ తన బాక్సర్ సినిమాను ఆ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారట. సినిమా విడుదల విషయంలో వరుణ్ అండ్ టీం తొందర పడుతున్నారా అనే చర్చ జరుగుతోంది. వరుణ్ తేజ్ హడావుడిగా కాకుండా కాస్త మెల్లగా సక్సెస్ తో రావాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఈ చిత్రంతో అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ ఫుల్ టైం నిర్మాతగా మారిపోబోతున్నాడు. ఇన్నాళ్లు ఇతరత్ర వ్యాపారాలతో బిజీగా ఉన్న బాబీ ఈ సినిమాను అంతా తానై నిర్మించబోతున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.