Begin typing your search above and press return to search.
బాక్సర్ కోసం ఇంకో ఐదు నెలలు ఆగాలి!
By: Tupaki Desk | 4 March 2020 3:30 PM GMTఏంరో.. తమాషాలు చేస్తున్నవ్.. నాపై పందెం కట్టు గెలుస్తవ్.. నాతో పందెం కట్టావో చస్తవ్. అంటూ గుబురు గడ్డం.. ముఖంపై గాటుతో అదో రకమైన లుక్ లో గద్దలకొండ గణేశ్ గా ఆకట్టుకున్నాడు వరుణ్ తేజ్. బాక్సాఫీస్ రిజల్ట్ తో పని లేకుండా నటుడిగా మెప్పించాడు. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణతేజ్ తన ప్రతి సినిమాకీ వేరియేషన్ చూపిస్తున్నాడు. ఏ పాత్ర వచ్చినా ముందుగా ఆ పాత్రకు తగ్గట్టు కసరత్తు చేశాకే షూటింగ్ లోకి అడుగు పెడుతున్నాడట. ఇంతకుముందు విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించిన ఎఫ్-2లోనూ తెలంగాణ యాసతో మంచి కామెడీ టైమింగ్ తో చక్కని మార్కులే కొట్టేశాడు ఈ పొడగరి. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనదైన ముద్రతో గుర్తింపు తెచ్చుకోవాలని తెగ తాపత్రయ పడుతుంటాడని సన్నిహితులు చెబుతుంటారు. అయితే కథల ఎంపికలోనూ చాలా కసరత్తు చేశాకే ఈయన సెట్స్ పైకి వెళ్లడం తన పద్ధతి అని ప్రూవ్ అయ్యింది.
మొదటి నుంచీ తన సినిమాల్లో మంచి కథ ఉండేలా జాగ్రత్త పడ్డాడు కాబట్టే.. కెరీర్ లో ముకుంద- కంచె.. తొలి ప్రేమ ఇలా మంచి హిట్లు తన ఖాతాలో వచ్చి చేరాయని ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా ఆయన మెలి తిరిగిన కండలతో దర్శనమిస్తున్నారు. తన ఎదుట రింగ్ లోకి ఎవరైనా వచ్చారో ఒక్క కిక్ తో మట్టికరిపిస్తానని హెచ్చరికలు పంపిస్తున్నారు. ఇదంతా ఎందుకంటే త్వరలో రానున్న ఆయన కొత్త సినిమాలో బాక్సర్ గా పంచ్ లు విసరబోతున్నారు. ఇప్పటికే నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ పై ఉంది వరుణ్ బాక్సింగ్ రింగ్ లో రెచ్చిపోతున్నాడన్న సమాచారం ఉంది. ఈ సినిమాలో అసలు సిసలైన బాక్సర్‌గా కనిపించడానికి ఈ మెగా హీరో చాలా రిస్కే చేస్తున్నారరు. బాక్సర్ గా ఫిట్‌నెస్ కోసం అమెరికన్ బాక్సింగ్ గోల్డ్ మెడలిస్ట్ టోనీ జెఫ్రిన్ దగ్గర శిక్షణ కూడా తీసుకున్నాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 24న స్టీల్ సిటీ వైజాగ్ లో ప్రారంభమై శరవేగంగా సాగుతోంది. ఈ షెడ్యూల్ 25 రోజులపాటు సాగనున్నట్లు చిత్ర నిర్మాణ వర్గాలు వెల్లడించాయి.
అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేష్ - సిద్దు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 30వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే తమ అభిమాన నటుడు పవన్ కల్యాణ్ గతంలో తమ్ముడు చిత్రంలో బాక్సర్ గా చేసిన వీర విహారం ఇప్పటికీ మరిచిపోని మెగా ఫ్యాన్స్.. తాజాగా వరుణ్ తేజ్ ను బాక్సర్ గా ఎప్పుడు చూద్దామా ? అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరి ఈ బాక్సర్ ఏ మేరకు అదరగొడతాడో చూడాలంటే మరో ఐదు నెలలు ఓపిక పట్టాల్సిందే.