Begin typing your search above and press return to search.

ట్యాగ్ వద్దంటే ఫ్యాన్స్ ఊర్కుంటారా!?

By:  Tupaki Desk   |   12 April 2017 1:26 PM GMT
ట్యాగ్ వద్దంటే ఫ్యాన్స్ ఊర్కుంటారా!?
X
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్.. ఇప్పుడు మిస్టర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం రిలీజ్ కానుండడంతో.. ఇప్పటికే ప్రమోషన్స్ లో కూడా స్పీడ్ పెంచేశాడు. మిస్టర్ ప్రచారంలో భాగంగా నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ చేసిన కొన్ని కామెంట్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి.

ఇప్పటికే వరుణ్ తేజ్ ను మెగా ప్రిన్స్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. అయితే.. తనకు ఇలాంటి ట్యాగ్ లంటే ఇష్టం ఉండదన్న ఈ మెగా హీరో.. అలా పిలవడం ఎంబరాసింగ్ గా ఉంటుందని కూడా చెప్పాడు. తన కామెంట్స్ కు సపోర్ట్ గా.. బాలీవుడ్ లో ఇలాంటివి షారూక్.. ఆమిర్ ఉపయోగించుకోరని కూడా చెప్పాడు. అయితే.. నార్త్ సంగతి వేరు. సౌత్ లో ఎమోషన్స్ వేరుగా ఉంటాయి. ఇక్కడ స్టార్ హీరోలను దేవుళ్ల కింద కొలిచేస్తూ ఉంటారు అభిమానులు. అందుకే వారసులుగా వచ్చిన వారికి.. మొదటి సినిమా నుంచే డిమాండ్ కనిపిస్తుంది.

కానీ బాలీవుడ్ లో అయితే వారిని వారు ప్రూవ్ చేసుకుంటేనే అభిమానుల సపోర్ట్ కంటిన్యూ అవుతుంది. అందుకే ఇక్కడ ఏ స్థాయికి వచ్చినా.. వారి పేర్ల ముందు ఓ ట్యాగ్ తప్పనిసరి. ఉదాహరణకు.. రజినీకాంత్ ఆ స్థాయికి వచ్చాక ఆయనకు ఇప్పటికీ సూపర్ స్టార్.. తలైవా లాంటి ట్యాగ్స్ తగిలించడానికి కారణం అదే. అర్ధం చేసుకో మెగా కుర్రాడా.. వద్దంటే ఫ్యాన్స్ హర్టవుతారిక్కడ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/