Begin typing your search above and press return to search.

3 ఏళ్ళు.. 3 సినిమాలు.. కాని..

By:  Tupaki Desk   |   27 Feb 2017 3:24 PM GMT
3 ఏళ్ళు.. 3 సినిమాలు.. కాని..
X
ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మరో సంబరం చేసుకుంటున్నారు. అసలు మెగా ఫ్యామిలీ మొత్తంలో హ్యాండ్సమ్ ప్రిన్స్ అనేంత లుక్కులతో అభిమానులకు పిచ్చెత్తించిన హీరో వరుణ్‌ తేజ్. మనోడు ఈరోజుతో ఫిలిం ఇండస్ర్టీలోకి అడుగుపెట్టి మూడు సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా త్రీ ఇయర్స్ ఆఫ్‌ వరుణ్‌ తేజ్ అంటూ సోషల్ మీడియాలో హంగామా టాపు లేచిపోతోంది.

నిజానికి ఈ మూడేళ్లలో వరుణ్ తేజ్ కేవలం మూడు సినిమాలు మాత్రమే చేశాడు. తొలి సినిమాను శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్లో ముకుందా అంటూ చేస్తే.. ఆ తరువాత క్రిష్‌ దర్శకత్వంలో కంచె.. పూరి జగన్ డైరక్షన్లో లోఫర్ సినిమాను చేశాడు. ముకుందా సినిమాతో మనోడు యాక్టింగ్ పరంగా పర్వాలేదు అనిపించుకుంటే.. కంచెతో బాగానే ప్రూవ్ చేసుకున్నాడు. అయితే మాస్ వేషాలు వేద్దాం అని లోఫర్ చేస్తే మాత్రం కాస్త బెడసికొట్టేసింది. అయినాసరే మెగా ఫ్యామిలీ నుండి ఈ హీరో కూడా పర్లేదు అనిపించుకున్నాడు.

కాకపోతే ఇంకా సరైన కమర్షియల్ హిట్టు పడకపోవడం ఒక మైనస్ అనే చెప్పాలి. ఎందుకంటే వరుసగా రెండు మూడు హిట్లు పడితేనే కదా అసలు మనోడి మార్కెట ఎంతనేది ఒక స్పష్టత వచ్చేది. అలా వచ్చినప్పుడు ఏ రేంజు సినిమాలో చేయాలి అనే క్లారిటీ వస్తుంది. త్వరలోనే శ్రీను వైట్ల మిష్టర్.. శేఖర్ కమ్ముల ఫిదా సినిమాలతో వస్తున్న వరుణ్‌ తేజ్.. ఏం చేస్తాడో చూద్దాం!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/