Begin typing your search above and press return to search.

అప్పుడే ఏడాది పూర్తయిపోయిందా...

By:  Tupaki Desk   |   24 Dec 2015 7:30 PM GMT
అప్పుడే ఏడాది పూర్తయిపోయిందా...
X
2014 డిసెంబర్ 24న నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన మొదటి సినిమా ముకుంద రిలీజ్ అయింది. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా.. వరుణ్ తేజ్ యాక్టింగ్ స్కిల్స్ కి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. మెగా ఫ్యాన్స్ కూడా ఈ అందగాడికి సాదర స్వాగతం పలికారు.

మా కుటుంబం మొత్తానికి అందగాడు అంటూ మెగాఫ్యామిలీతో పొగిడించుకున్న వరుణ్ తేజ్ కు.. పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి నుంచి, తండ్రి నాగబాబు నుంచి బోలెడు సపోర్ట్ ఉంది. మరోవైపు బాబాయ్ పవన్ కళ్యాణ్ కూడా ఈ వరుణ్ అంటే బోలెడంత అభిమానం చూపిస్తాడు. తొలి సినిమా ముకుంద రిలీజ్ అయ్యి.. ఇప్పటికి ఏడాది పూర్తవడంతో తన సంతోషాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నాడు వరుణ్ తేజ్. అభిమానులందరి ప్రేమ, మద్దతుకి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు.

అరంగేట్రం తర్వాత ఈ ఏడాది సమయంలోనే మరో రెండు మూవీస్ ని రిలీజ్ చేసి జోరు చూపించాడు వరుణ్ తేజ్. కంచె లాంటి థీమ్ బేస్డ్ చిత్రంలో నటించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కించుకున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన లోఫర్ ఫెయిల్ అయినా.. కుర్రాడిలో ఉన్న మాస్ స్కిల్స్ ని మాత్రం బాగా ఎలివేట్ చేసేందుకు పూరీ చిత్రం ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే.. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ హీరోలందరిలో ఫుల్ పేస్, ఫామ్ లో ఉన్నోడు వరుణ్ తేజ్ అనేందుకు సందేహించనక్కర్లేదు. ఇప్పుడు మరోసారి కంచె ఫీట్ ను రిపీట్ చేస్తూ.. క్రిష్ తో డైరెక్షన్ లో రాయబారి చిత్రాన్ని చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఆ మూవీలోని హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తోనే జత కడుతుండడం విశేషం.