Begin typing your search above and press return to search.
మెగా హీరో అప్పుడే పది సినిమాలు
By: Tupaki Desk | 12 Oct 2019 1:30 AM GMTఏదైనా జడ్జిమెంట్ విషయం వచ్చినప్పుడో - లేక అనుభవం గురించి మాట్లాడినప్పుడో పట్టు మని పది సినిమాలు కూడా చేయలేదని అనడం కామనే. అయితే మెగా హీరో వరుణ్ తేజ్ మాత్రం ఇందుకు మినహా అయిపోయాడు. తక్కువ టైంలో పది సినిమాలు పూర్తి చేసేసి అందరికీ షాక్ ఇచ్చాడు మెగా ప్రిన్స్.
అవును వరుణ్ కొత్త సినిమా ఓపెనింగ్ రోజు 'వరుణ్ తేజ్ 10' అనే హ్యాష్ ట్యాగ్ చూడగానే అందరూ షాకయ్యారు. ఒక వైపు ఎప్పటి నుండో ఉన్న ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ స్టార్ హీరోలు ఇంకా 20 - 25 దగ్గరే ఉంటే అప్పుడే మెగా హీరో పది సినిమాలు చేసేసాడా..? అంటూ మాట్లాడుకున్నారు. నిజానికి జెట్ స్పీడ్ లో సినిమాలు చేసే మెగా కుర్ర హీరోల్లో వరుణ్ అందరికంటే ముందున్నాడు. 'ముకుందా' విడుదలై సరిగ్గా ఐదేళ్ళవుతుంది. అంటే ఏడాదికి రెండు చెప్పున వరుణ్ ఐదేళ్ల పాటు రెండేసి సినిమాలు చేసినట్టే. ఈ ఏడాది డిసెంబర్ తో వరుణ్ ఇండస్ట్రీలో హీరోగా ఐదేళ్లు పూర్తి చేసుకుంటాడు.
ఇక లేటెస్ట్ గా 'గద్దలకొండ గణేష్' తో సూపర్ హిట్ కొట్టిన వరుణ్ తన పదో సినిమా స్పెషల్ గా ఉండేలా చూసుకున్నాడు. అందుకే బాక్సింగ్ నేపథ్యంతో ఉండే కథను ఎంచుకొని కిరణ్ అనే కొత్త దర్శకుడికి అవకాశమిచ్చాడు. ఎప్పటికప్పుడు విభిన్న కథలతో కొత్తగా ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న మెగా ప్రిన్స్ పదో సినిమాతో ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి.