Begin typing your search above and press return to search.

బాబూ వరుణ్.. బావకు కౌంటరేశావా?

By:  Tupaki Desk   |   11 July 2017 1:30 PM GMT
బాబూ వరుణ్.. బావకు కౌంటరేశావా?
X
కాలం కలిసి రాకపోతే.. తాడు పట్టుకున్నా పామై కరుస్తుందని ఓ సామెత ఉంది. అల్లు అర్జున్ విషయంలో అనుకోకుండా జరిగినా.. ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అసలే 'చెప్పను బ్రదర్' వివాదం కారణంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు టార్గెట్ అయిన బన్నీ.. ఇప్పుడు మెగాస్టార్ ఫ్యాన్స్ తో కూడా ఎదురుదెబ్బ తినాల్సి వచ్చింది. ఏదో తన సినిమా డీజేకు సపోర్ట్ గా నిలిచేందుకు ట్రై చేస్తే.. అది కాస్తా తేడా వచ్చి ఖైదీ నంబర్ 150ని మించినట్లు చెప్పుకున్నట్లు అయింది.

ఇదంతా మెగా హీరోలు బాగానే అబ్జర్వ్ చేస్తున్నారనిపిస్తోంది. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన కొత్త సినిమా ఫిదా ఆడియో ఫంక్షన్ జరిగింది. ఈ వేడుకలో ఈ క్లాస్ హీరో మాట్లాడుతూ.. 'మేం ఇప్పుడీ స్థితిలో ఉన్నామంటే.. అందుకు ప్రధాన కారణం పెదనాన్న చిరంజీవి.. బాబాయ్ పవన్ కళ్యాణ్. వాళ్లు పడిన కష్టమే మాకు ఈ స్థితి తీసుకొచ్చింది. వారి గురించి మాట్లాడే అవకాశం వస్తే.. అందులోనూ ఇలాంటి పెద్ద స్టేజ్ పై మాట్లాడే అవకాశం వస్తే అస్సలు వదులుకోను. మేం మాట్లాడేటప్పుడు అందరూ ఇష్టపడాలని రూల్ లేకపోయినా.. మేం వారిని గుర్తు చేసుకోవడం మాత్రం మానబోము' అన్నాడు వరుణ్ తేజ్.

అయితే.. పవన్ గురించి మాట్లాడమంటే చెప్పను అని బన్నీ చెప్పడం.. రీసెంట్ గా చిరు- పవన్ ల సినిమా కంటే తన సినిమాకి వసూళ్లు ఎక్కువ వచ్చాయనే టైపులో ప్రొజెక్ట్ చేసుకోవడం కారణంగానే.. బన్నీ బావకు వరుణ్ తేజ్ కౌంటర్ వేశాడని ఇండస్ట్రీ జనాల ఫీలింగ్. దీనిపై బన్నీ అండ్ కో ఏమంటారో చూడాలి!!