Begin typing your search above and press return to search.

వరుణ్‌ బాబూ.. 5 కోట్లంటే టూ మచ్

By:  Tupaki Desk   |   28 May 2016 4:41 AM GMT
వరుణ్‌ బాబూ.. 5 కోట్లంటే టూ మచ్
X
ఒక్కో సినిమా అసలు షూటింగ్‌ అవ్వకుండా లేటవుతున్న కొద్దీ అనేక కొత్త కొత్త రూమర్లు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ''మిష్టర్‌'' పరిస్థితి కూడా అంతే. అసలు ఈ సినిమా ఎప్పుడో ఫిబ్రవరిలో మొదలవ్వాలి. అక్కడి నుండి ఏప్రియల్‌.. ఇప్పుడేమో జూన్‌ వరకు సాగదీశారు. అయితే స్పెయిన్‌ వెళ్ళడానికి వీసా ప్రాబ్లమ్ కారణంగా సినిమా మొదలు కాలేదని ప్రొడక్షన్ వర్గాలు చెప్పిన స్టోరి.

ఇప్పుడు ఫిలిం నగర్‌ లో వినిపిస్తున్న మరో స్టోరీ ఏంటంటే.. మెగా హీరో వరుణ్‌ తేజ్‌ కు నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)కి అస్సలు పడట్లేదు. ఎందుకంటే.. కొత్త కుర్రాడు కదా ఓ 2 కోట్లు రెమ్యూనరేషన్‌ ఇద్దాం అని బుజ్జి అనుకుంటే.. మనోడేమో 5 కోట్లు ఉంటేనే మాట్లాడదాం అన్నాడట. మరో రవితేజ టైపులో రెమ్యూనరేషన్‌ ఫైనల్‌ అయ్యేవరకు సినిమా సైన్‌ చేసి పట్టాలెక్కించేది లేదు అన్నట్లు ఉందట వరుణ్‌ వాటం. ఒక కొత్త హీరో.. ఇంకా అసలు మార్కెట్‌ కుదురుకోలేదు. అప్పుడే 5 కోట్లంటే కష్టమే మరి. ఇందులో ఎంతవరకు నిజం అండ్‌ అబద్దం అనేవి ఉన్నాయో తెలియదు కాని.. కెరియర్‌ ఎల్.కె.జి.లో ఉన్నప్పుడే ఇటువంటి డిమాండ్లు తెరపైకి తెస్తే.. తరువాతి రోజుల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ అమెరికాలో ఉన్నాడు. అక్కడ నాటా వారి తెలుగు సంబరాల్లో పాల్గొని ఇండియా తిరిగొస్తాడు.