Begin typing your search above and press return to search.
'మిష్టర్'ను పక్కనెట్టి.. కమ్ములకు క్లియర్?
By: Tupaki Desk | 19 May 2016 7:30 AM GMTఇతర మెగా సినిమాల ఆడియోల్లో మెరుస్తున్న వరుణ్ తేజ్.. తన సొంత సినిమా ఎప్పుడో సరిగ్గా చెప్పట్లేదు. అయితే జూన్ మొదటి వారం నుండి శ్రీను వైట్ల డైరక్షన్ లో రూపొందనున్న ''మిష్టర్'' సినిమా షూటింగ్ మొదలెడెతున్నారని ఆల్రెడీ చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యన ఈ సినిమా నుండి హెబా పటేల్ ను తీసేశారు అనే రూమర్ పై స్పందిస్తూ.. అబ్బే లేదు.. హెబ్బా ఈజ్ దేర్ అంటూ నిర్మాతలు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అప్పుడే.. జూన్ లో షూటింగ్ అని కూడా తేల్చేశారు. ఇప్పుడు లేటెస్టుగా ఈ సినిమా గురించి మరో రూమర్ వినిపిస్తోంది.
నిజానికి దిల్ రాజు సారథ్యంలో శేఖర్ కమ్ముల వినిపించిన స్టోరీ.. వరుణ్ కు తెగ నచ్చేసిందట. దానితో అసలు ''మిష్టర్''ను పక్కనెట్టేసి ఈ సినిమాను ముందు రిలీజ్ చేసేస్తే ఎలా ఉంటుంది అనే తరహాలో ఆలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పైగా ఇప్పటికే శేఖర్ కమ్ముల కూడా బైండ్ స్ర్కిప్టుతో రెడీగా ఉన్నాడు కాబట్టి.. సినిమాను పట్టాలెక్కించడానికి పెద్దగా టైమ్ పట్టదని అంటున్నారు. అయితే.. ఇవన్నీ కూడా రూమర్లే అయ్యే ఛాన్సుంది. నిజానికి శ్రీను వైట్ల సినిమాను స్పెయిన్ లో తెరకెక్కించాలని చూస్తున్నారు. అందరికీ వీసాలు గట్రా ప్రాసెసింగ్ అవ్వాలి కాబట్టి.. టైమ్ తీసుకుంటోందని టాక్. చూద్దాం మరి ఏం జరుగుతుందో!!