Begin typing your search above and press return to search.
నాన్న కోసం కొడుకు ఒక్కడే వచ్చాడు
By: Tupaki Desk | 6 April 2019 1:33 PM GMTనరసాపురం ఎంపీగా జనసేన తరపు నుంచి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు పోటీ చేస్తున్నారు. జనసేన నుంచి ఎంపీ అభ్యర్థిగా నాగబాబుని పవన్ ప్రకటించినప్పటినుంచి.. ఆయన ఒక్కడే నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. ప్రచారం మొదలైన రెండు రోజుల తర్వాత నాగబాబు భార్య పద్మజ - కుమార్తె నిహారిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వీరితో పాటు కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా నాగబాబుపై అభిమానంతో ఎన్నికల ప్రచారం చేశారు.
మెగాఫ్యామిలీలో చాలామంది హీరోలున్నా వాళ్లెవ్వరూ ప్రచారానికి రాకుండా దూరంగా ఉండిపోయారు. కానీ కన్న కొడుక్కి తప్పదు కదా. అందుకే.. తన షూటింగ్‌కు ప్రస్తుతం కాస్త గ్యాప్ ఇచ్చి వరుణ్ తేజ్.. ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడు. షూటింగ్ నుంచి డైరెక్ట్ గా నరసాపురం వచ్చిన వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్ అభిమానుల్ని ఆకట్టుకునేందుకు జనసేన మార్క్ టవల్ తో ప్రచారం నిర్వహించాడు. ప్రతీ ఒక్కరికి నమస్కారం చేస్తూ.. తన తండ్రికి ఓటు వేసి గెలిపించాలని కోరాడు. మధ్యమధ్యలో కారు ఆపి.. ప్రసంగించాడు. బాబాయ్ ఆశయ సాధన కోసం తన తండ్రి ఎన్నికల బరిలోకి దిగారని.. ఆయన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరాడు. వరుణ్‌ని చూసేందుకు అభిమానులు భారీ ఎత్తుల తరలివచ్చారు.
మొదట్లో రామ్ చరణ్ - అల్లు అర్జున్ కూడా ప్రచారానికి హాజరు అవుతారని వార్తలు వచ్చాయి. కానీ రామ్ చరణ్ RRR షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల రావడం కుదరదని ట్విట్టర్ ద్వారా తేల్చి చెప్పేశాడు. ఇక బన్నీ కూడా అంతే. నాగబాబుకి సపోర్ట్ చేస్తున్నట్లు ఒక లెటర్ రిలీజ్ చేశాడు. సాయిధరమ్ తేజ్ - అల్లు శిరీష్ లాంటి వాళ్లు షూటింగ్ ల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. దీంతో.. తన తండ్రి కోసం ఒక్కడే ఎన్నికల ప్రచారంలోకి వచ్చాడు వరుణ్ తేజ్.