Begin typing your search above and press return to search.

చిరు ఆ మాట చెప్పగానే వరుణ్ ఏడ్చేశాడట

By:  Tupaki Desk   |   22 Oct 2015 11:30 AM GMT
చిరు ఆ మాట చెప్పగానే వరుణ్ ఏడ్చేశాడట
X
మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి వెళ్లిపోవడం అప్పట్లో అభిమానులకు విపరీతమైన వేదన కలిగించింది. ఐతే అభిమానులే కాదు కుటుంబ సభ్యుడినైన తనకు కూడా అప్పట్లో ఆ నిర్ణయం నచ్చలేదని అంటున్నాడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్.

‘‘పెదనాన్న సినిమాలు చూస్తూనే పెరిగా. ఆయనకు నేను పెద్ద ఫ్యాన్. బ్రూస్ లీ సినిమాతో ఆయన మళ్లీ సినిమాల్లోకి రావడం చాలా ఆనందం కలిగించింది. ఆయన్ని తెరమీద చూడ్డం కోసం ఎంత ఉత్కంఠగా ఎదురు చూశానంటే.. రిలీజ్ వరకు ఆగలేకపోయా. ముందే ప్రివ్యూ థియేటరు కెళ్లి పెదనాన్నకు సంబంధించిన సన్నివేశాలు చూసేశాను. ఐతే జనం మధ్య కూర్చుని ఆ సన్నివేశాలు చూసి ఉంటే బాగుండేదనిపిస్తోందది. అసలు పెదనాన్న సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వెళ్లడం నాకిష్టమే లేదు. ఆ డెసిషన్ చెప్పగానే నేను తలుపు వేసుకుని ఏడ్చేశాను. మళ్లీ పెదనాన్నను స్క్రీన్ పై చూడనా.. అనుకుని అప్పట్లో అంత బాధపడ్డా. మళ్లీ ఆయన సినిమాల్లోకి చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పాడు వరుణ్.

ఈ మధ్య మెగా ఫ్యామిలీలో బాండింగ్స్ కొంచెం తగ్గినట్లున్నాయి కదా అని వరుణ్ ను అడిగితే.. ‘‘అలాంటిదేమీ లేదు. అందరం కాస్త బిజీ అయ్యాం అంతే. ఒకే ఇంట్లో ఉంటున్నా నాన్న, నేను మాట్లాడుకుని నాలుగైదు రోజులవుతోంది’’ అన్నాడు. బ్రూస్ లీ సినిమాకు సంబంధించి పవన్ చిరు ఇంటికి వచ్చినపుడు నాగబాబు అక్కడ లేకపోవడంపై స్పందిస్తూ.. ‘‘బాబాయి అక్కడి వెళ్తున్నట్లు నాన్నకు తెలిసి ఉండదు. అది క్యాజువల్ మీటింగే కదా’’ అని బదులిచ్చాడు.