Begin typing your search above and press return to search.
మెగా హీరోకు గోవాలో ఏం నచ్చిందో
By: Tupaki Desk | 5 Jan 2016 5:30 PM GMTన్యూ ఇయర్ ఏమో గాని.. యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ మాత్రం గోవా ని వదిలి రాలేకపోతున్నాడు. ఇప్పటికే లోఫర్ సినిమాలో గోవా మొత్తం బాగానే కవర్ చేసిన ఈ డైనమిక్ స్టార్.. ఇప్పుడు అక్కడే మకాం వేయడానికి కారణమేంటో మరి?
సముద్రపు ఒడ్డున - చల్లటి గాలిలో - సూర్యుడు అస్తమిస్తున్న దృశ్యాన్ని ఆస్వాదించే అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. అలాంటి సంధ్యా సమయంలో తీసుకున్న ఓ ఫొటోను మెగా ఫ్యామిలీ యువ నటుడు వరుణ్ తేజ్ షేర్ చేశాడు. దాని గురించి బీభత్సంగా చెప్పుకొచ్చాడు. మీడియవారు ఎవరైనా మెసేజ్ పెడితే కూడా.. ఇదే విషయం గురించి చెబుతున్నాడు. గోవా కేక అంటున్నాడు. జీవితంలో మరచిపోలేని సూర్యాస్తమయం అంటూ చెప్పుకొచ్చాడంటే.. అసలు ఏమైయుంటుంది అంటూ అందరూ స్టన్ అవుతున్నారు.
ఇకపోతే ప్రస్తుతం వరుణ్ తేజ్ తన చిన్ననాటి స్నేహితులతో కలిసి గోవాలో సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు. న్యూ ఇయర్ పార్టీకి అని వెళ్లి. ఐదు రోజులు గడిచినా కూడా ఇంకా అక్కడే ఉండటం కాస్త కామెడీనే కాని.. మరి ఎందుకున్నాడో ఏంటో.. ఇంతకీ క్రిష్ సినిమా లాంచ్ అండ్ షూటింగ్ ఎప్పుడు గురూ?