Begin typing your search above and press return to search.

వెనుక నుంచి వచ్చి ముద్దు పెట్టి వెళ్లిపోయిందట..!

By:  Tupaki Desk   |   15 Sep 2019 10:43 AM GMT
వెనుక నుంచి వచ్చి ముద్దు పెట్టి వెళ్లిపోయిందట..!
X
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి.. సినిమాకు.. సినిమాకు మధ్య వేరియేషన్ చూపించటమే కాదు.. నటనలో మెరుగవుతున్నాడు వరుణ్ తేజ్. భిన్నమైన సినిమాల్ని ట్రై చేస్తూ.. తన సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న భరోసాను ఇస్తున్నాడు. తాజాగా అతను నటించిన చిత్రం వాల్మీకి. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ అయిన జిగర్తాండ అన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్.. టీజర్ ట్రైలర్ తో సినిమా మీద అంచనాలు పెరిగాయి. వాస్తవానికి గత వారమే విడుదల కావాల్సిన ఈ సినిమా నాని గ్యాంగ్ లీడర్ మూవీ రిలీజ్ తో క్లాష్ కావటం.. నిర్మాతల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ వారం (సెప్టెంబరు 20) విడుదల చేయనున్నారు. సినిమా ప్రమోషన్ వర్క్ ను పెంచిన వరుణ్ తేజ్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

ఎప్పుడైనా అనుకోని ఘటనతో ఇబ్బంది పడ్డారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఒకసారి తన స్నేహితులతో కలిసి ఒక ఫంక్షన్ కు వెళ్లానని.. కొంతమంది స్నేహితులం కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక అమ్మాయి వెనుక నుంచి వచ్చి హగ్ చేసుకుందన్నారు. అంతలోనే చెంప మీద ముద్దు పెట్టుకొని వెళ్లిపోయిందని.. ఇదంతా తిరిగి చూసే లోపు జరిగిపోయినట్లు చెప్పారు. అది జరిగిన వెంటనే అందరి ముందు ఇబ్బందిగా అనిపించిందని.. సిగ్గుగా అనిపించినట్లు చెప్పాడు. ఇంతకీ. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలుసా వరుణ్ తేజ్?