Begin typing your search above and press return to search.
#నిహారిక.. బంగారు తల్లి అంటూ వరుణ్ ఎమోషన్
By: Tupaki Desk | 12 Dec 2020 4:09 AM GMTమెగా వారసురాలు.. నాగబాబు గారాల పట్టి నిహారిక వెడ్డింగ్ ఈ నెల 9న రాజస్థాన్ ఉదయ్ పూర్ ఉదయ్ విలాస్ లో అత్యంత అట్టహాసంగా డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరిగింది. వారం ముందుగానే హైదరాబాద్ లోని నాగబాబు ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. మూడు రోజుల ముందే పెళ్లి కూతురు కార్యక్రమం నుంచి నిహారిక పెళ్లి హంగామా స్టార్టయింది. పెళ్లి భాజాలు.. మంగళ తోరణాలు.. మంగళ స్నానాలు.. వంటి పెళ్లి కార్యక్రమాలతో నాగబాబు ఇల్లు కళకళలాడింది.
ఇక మెగా ఫ్యామిలీలన్నీ ఉదయ్ పూర్ కు చేరడంతో మెగా సంబరం అంబరాన్ని తాకింది. ప్రతీ ఒక్కరూ అమితానందంతో పెళ్లి వేడుకని ఎంజాయ్ చేశారు. సంగీత్ లో ఆడిపాడారు. రామ్‌చరణ్ మెగాస్టార్ చిరంజీవి- వరుణ్‌తేజ్ - బన్నీ- సాయిధరమ్ తేజ్.. వైష్ణవ్ తేజ్ ఇలా అంతా సంగీత్ లో స్టెప్పులేసి ఎంజాయ్ చేశారు. కొత్త జంటతో కూడా డ్యాన్స్ చేయించి మురిసిపోయారు. పెళ్లి సందర్భంగా మెగాబ్రదర్ నాగబాబు భావోద్వేగానికి లోనైన విషయం తెలిసిందే. ఇప్పటికీ నిహారిక తనకి చిన్న పిల్లలానే వుందని ఎమోషనల్ అయ్యారు.
తాజాగా వరుణ్ తేజ్ కూడా తన మనసులోని మాటని బయటపెట్టారు. తన చెల్లెలు నిహారిక అంటే తన గుండెలోతుల్లో ఎంత ప్రేమ వుందో వ్యక్తం చేశాడు. `నా బంగారుతల్లి నిహారిక,... మా డ్యాషింగ్ బావ చైతన్యకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నేనిప్పుడు ఎంత సంతోషంగా వున్నానో వర్ణించేందుకు మాటలు సరిపోవు` అంటూ వరుణ్ తేజ్ తన సిస్టర్ పై వున్న తన ప్రేమని వ్యక్తం చేశాడు.