Begin typing your search above and press return to search.
ముందు మిష్టర్.. తరువాతే ఫిదా
By: Tupaki Desk | 20 Oct 2016 4:58 AM GMTనాగబాబు తనయుడు మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్.. రీసెంట్ గా యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే. రీసెంట్ గా శ్రీను వైట్ల మూవీ మిస్టర్ కు ఊటీ షూటింగ్ సమయంలో ప్రమాదం జరగడం.. కాలికి ఫ్రాక్చర్ కావడంతో.. ఎలాగోలా ఆ షెడ్యూల్ పూర్తి చేసి హైద్రాబాద్ చేరుకున్నారు.
ఈ పాటికే ఈ మెగా హీరో అమెరికా ఫ్లైట్ ఎక్కేయాల్సి ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఫిదా.. తాజా షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుతం వరుణ్ తేజ్ పరిస్థితి నడిచేటట్లుగా కూడా లేదు. పెను ప్రమాదం లేకపోయినా.. ఐదు వారాల పాటు రెస్ట్ తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పేశారట డాక్టర్లు. దీంతో నెలకు పైగా రెండు సినిమాల షెడ్యూల్స్ పోస్ట్ పోన్ చేసుకోక తప్పని సరి పరిస్థితి ఏర్పడింది. తన సినిమా షూటింగ్ ఆర్డర్ ను కూడా మార్చుకున్నాడట ఈ మెగా హీరో.
ప్రస్తుతం స్టార్ట్ చేయాల్సింది శేఖర్ కమ్ముల మూవీ షెడ్యూల్ అయినా.. కోలుకున్నాక ముందుగా శ్రీనువైట్లకే సినిమా చేస్తాడట. ఈ షెడ్యూల్ తో వైట్ల మిస్టర్ కంప్లీట్ కానుందని తెలుస్తోంది. ఆ తర్వాత ఫిదా కోసం లావణ్యత్రిపాఠితో కలిసి అమెరికా వెళ్తాడు వరుణ్ తేజ్. ఇక ఫిదాలో మలయాళీ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/