Begin typing your search above and press return to search.

బెంజ్ ఎక్కనున్న హ్యాండ్సమ్ మెగా హీరో

By:  Tupaki Desk   |   3 Jan 2018 5:11 PM GMT
బెంజ్ ఎక్కనున్న హ్యాండ్సమ్ మెగా హీరో
X
సెలబ్రిటీలు అంటేనే.. లగ్జరీ కార్లు వాడతారని వేరే చెప్పక్కర్లేదు. మన దగ్గర కేవలం హీరోలే ఇలాంటి కార్లు వాడతారు కాని.. పక్కనున్న తమిళనాడులో అయితే శంకర్ వంటి దర్శకులు కూడా రోల్స్ రాయిస్ వాడుతున్నారు. ఇకపోతే ఇప్పుడు హ్యాండ్సమ్ మెగా హీరో వరుణ్‌ తేజ్ కూడా.. వరుసగా సినిమాలు చేస్తూ.. రెండు చేతులా సంపాదిస్తూ.. ఒక సొంత బెంజ్ కొనుక్కున్నాడు.

ఎప్పటినుండో అల్లు అర్జున్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్లు ఆల్రెడీ మెర్సిడెస్ బెంజ్ GL350 కారునే వాడుతున్నారు. ఈ మధ్యనే రకుల్ ప్రీత్ సింగ్ అండ్ తాప్సీ వంటి భామలు కూడా ఇదే కారును కొనుక్కున్నారు. కాకపోతే తాప్సీ కొన్నది మాత్రం కాస్త రేటు తక్కువ వేరియెంట్. అయితే ఇప్పుడు వరుణ్‌ తేజ్ అదే కారును కొనేశాడు. బన్నీ వాడుతున్న కారు తరహా కారునే తీసుకున్నాడు. అయితే బన్నీ తరహాలో 6666 వంటి ఫ్యాన్సీ నెంబర్ ఏదన్నా ఆక్షన్ లో కొనుక్కుంటాడేమో తెలియదు కాని.. ప్రస్తుతానికి తన తండ్రి నాగబాబును.. తల్లి పద్మజను తీసుకెళ్ళి.. హైదరాబాదులోని బెంజ్ షోరూమ్ నుండి ఈ 1 కోటి 30 లక్షల రూపాయల కారును డెలివరీ తీసుకున్నాడు.

సినిమాల విషయానికొస్తే.. ఈ ఫిబ్రవరి 9న 'తొలిప్రేమ' సినిమాతో అలరించబోతున్నాడు వరుణ్‌ తేజ్. అలాగే తరువాత రానాతో కలసి ఒక మల్టీస్టారర్ మరియు ఇతర సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు.