Begin typing your search above and press return to search.
మెగా గని బాక్సింగ్ రింగ్ లో దిగేది ఎప్పుడంటే..?
By: Tupaki Desk | 25 Dec 2021 6:43 AM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ''గని''. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అల్లు వెంకటేష్ - సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాని.. డిసెంబర్ 24న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే సినిమాల మధ్య క్లాష్ ఇండస్ట్రీకి మంచిది కాదని భావించి.. మేకర్స్ మరోసారి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో నేడు క్రిస్మస్ పండుగ సందర్భంగా ''గని'' సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ని నిర్మాతలు ప్రకటించారు. 2022 మార్చి 18న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
ఈ మేరకు ఓ పోస్టర్ ని చిత్ర బృందం వదిలింది. బాక్సింగ్ రింగ్ లో ప్రత్యర్థిని తన పంచ్ లతో పడగొట్టడానికి బాక్సర్ వరుణ్ తేజ్ సిద్ధంగా ఉన్నట్లు ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. మెగా పహీరో మూవీ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
'గని' చిత్రంలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. ఉపేంద్ర - సునీల్ శెట్టి - జగపతిబాబు - నదియా - నరేష్ - తనికెళ్ళ భరణి - నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్ పోస్టర్స్ - ఫస్ట్ సింగిల్ - టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి.
ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందించగా.. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 'గని' చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపెనీ సంస్థలు నిర్మిస్తున్నాయి. 'ఎఫ్ 2' 'గద్దలకొండ గణేష్' సినిమాల తర్వాత వరుణ్ తేజ్ నుంచి వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.